ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Air India: అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లాల్సిన విమానంలో సాంకేతిక లోపం

ABN, Publish Date - Jun 17 , 2025 | 02:55 PM

ఏఐ-159 బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానం షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 1.10 గంటలకు బయలుదేరాల్సి ఉండగా, తనిఖీలు చేపట్టారు. సాంకేతిక లోపం తలెత్తడంతో వెంటనే సర్వీసును నిలిపివేశారు.

న్యూఢిల్లీ: అహ్మదాబాద్ నుంచి లండన్‌కు వెళ్లాల్సిన ఎయిరిండియా విమానం (AI-159)లో మంగళవారంనాడు సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో విమాన సర్వీసును రద్దు చేసారు. ఇదే మార్గంలో ఎయిరిండియా విమానం (AI-171) ఈనెల12న అహ్మదాబాద్‌లో ఘోర దుర్ఘటన జరిగి విమానంలోని 241తో సహా, విమానం కూలిన నివాస సముదాయంలోని మరో 33 మంది మృతి చెందారు. ఈ ప్రమాదం తర్వాత ఇదే మార్గంలో లండన్‌కు వెళ్లాల్సిన తొలి షెడ్యూల్ విమానం కూడా ఇదే కావడం విశేషం.

కాగా, ఏఐ-159 బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానం షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 1.10 గంటలకు బయలుదేరాల్సి ఉండగా, తనిఖీలు చేపట్టారు. సాంకేతిక లోపం తలెత్తడంతో వెంటనే సర్వీసును నిలిపివేశారు. అహ్మదాబాద్ ఘోర విమాన ప్రమాదం తర్వాత ఏఐ-171 నెంబర్‌ను ఏఐ-159గా, రిటర్న్ ఫ్లయిట్ నెంబర్‌ను ఏఐ-160గా మార్చారు.

ఇవి కూడా చదవండి..

ఆ ఒక్క షరతుపై చర్చలకు సిద్ధమేనన్న టెహ్రాన్

అర్ధాంతరంగా అమెరికాకు ట్రంప్

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 17 , 2025 | 03:00 PM