Share News

Donald Trump: అర్ధాంతరంగా అమెరికాకు ట్రంప్

ABN , Publish Date - Jun 17 , 2025 | 09:15 AM

అమెరికా దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. తన కెనడా పర్యటనను అర్ధాంతరంగా ముగించుకున్నారు. ఆయన అమెరికా బయలుదేరి వెళ్లనున్నారు.

Donald Trump: అర్ధాంతరంగా అమెరికాకు ట్రంప్
US President Donald Trump

వాషింగ్టన్, జూన్ 17: కెనడా పర్యటనలో ఉన్న అమెరికా దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన పర్యటనను కుదించుకున్నారు. జీ 7 సదస్సులో పాల్గొన్న ఆయన వెంటనే ఆమెరికాకు బయలుదేరేందుకు సమాయత్తమవుతున్నారు. అమెరికా చేరుకున్న వెంటనే భద్రతా మండలితో అత్యసవర సమావేశం నిర్వహించనున్నారు. ఈ మేరకు వైట్ హౌస్ ఉన్నతాధికారులు వెల్లడించారు. ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో ఆయన ఈ పర్యటనను కుదించుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. ఈ యుద్ధం ముగించాలని ఇప్పటికే జీ 7 సదస్సులో పాల్గొన్న నేతలు పిలుపు నిచ్చిన సంగతి తెలిసిందే.


మరోవైపు.. అమెరికా రాగానే ట్రంప్ పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. భద్రతా సలహాదారులతో ఆయన అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. అందుకోసం వైట్‌హౌస సిచ్యుయేషన్ రూమ్‌లో సిద్ధంగా ఉండాలని భద్రతా మండలి అధికారులను ఆదేశించారు. ఇజ్రాయెల్, ఇరాన్ ఉద్రికత్తలకు సంబంధించి ట్రంప్ కీలక ప్రకటన లేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇంకోవైపు ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని పౌరులను వెంటనే ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలంటూ ట్రంప్ ఇప్పటికే హెచ్చరించారు. ఈ నేపథ్యంలో అమెరికా సైతం ప్రత్యక్ష దాడులు జరిపే అవకాశముందని తెలుస్తోంది.

Updated Date - Jun 17 , 2025 | 09:33 AM