Hero Vijay: అభిమానులకు హీరో విజయ్ సూచన.. విషయం ఏంటంటే..
ABN, Publish Date - May 01 , 2025 | 12:29 PM
తన అభిమానులకు సినీ హీరో, టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్‌య ఓ సూచన చేశారు. కార్లు, బస్సులు వంటి వాహనాల టాప్‌పై ఎక్కి ప్రయాణించొద్దంటూ సూచన చేశారు. అలాగే.. 2026లో జరిగే ఎన్నికల్లో టీవీకే పార్టీ గెలుపు ఖాయమన్నారు.
- ఆ వాహనాల పైకి ఎక్కొద్దు..
- అభిమానులకు విజయ్ విజ్ఞప్తి
చెన్నై: వాహనాలను అతి వేగంగా నడపవద్దని, కార్లు, బస్సులు వంటి వాహనాల టాప్‌పై ఎక్కి ప్రయాణించొద్దని తన అభిమానులకు, పార్టీ కార్యకర్తలకు సినీ హీరో, టీవీకే అధ్యక్షుడు విజయ్(Vijay) విజ్ఞప్తి చేశారు. ఇదే విషయంపై ఆయన బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇటీవల కోయంబత్తూరు వేదికగా జరిగిన టీవీకే బూత్ ఏజెంట్ల మహానాడుకు హాజరై పార్టీపైనా, తనపైనా ఎంతో ఆదరణ చూపించారన్నారు. తనపై ఇంతటి ప్రేమాభిమానాలు చూపించే మీ కోసం రాష్ట్రంలో నిజమైన ప్రజాస్వామ్య పాలన తీసుకొచ్చేందుకు తనవంతు ప్రయత్నం చేస్తున్నానని తెలిపారు.
ఈ వార్తను కూడా చదవండి: High alert: బంగ్లాదేశ్ సరిహద్దుల్లో హై అలర్ట్.. ఎందుకంటే..
2026లో జరిగే ఎన్నికల్లో టీవీకే గెలుపుతో ఇది సాధ్యమవుతుందన్నారు. పార్టీలోని యువకులు కొందరు వాహనాలను అతి వేగంగా నడుపుతూ ప్రమాదాలకు గురవుతున్నారని, కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కోల్పోతూ తనతో పాటు వారి కుటుంబ సభ్యులను దుఃఖ సాగరంలోకి నెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరికొందరు వాహనాల టాప్‌పై కూర్చొని, నిలబడి ప్రయాణం చేస్తూ ప్రాణాలపైకి తెచ్చుకుంటున్నారన్నారు. ఇలాంటి సాహసాలు ఎవరూ చేయొద్దని విజయ్ విజ్ఞప్తి చేశారు.
అలాంటి పొత్తుకు అవకాశం లేనట్టే..
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం అన్నాడీఎంకే - బీజేపీ కూటమితో చేతులు కలిపే అవకాశం లేదని విజయ్ తన సన్నిహితులతో చెప్పినట్లు తెలిసింది. అన్నాడీఎంకే - బీజేపీ కూటమితో పొత్తు పెట్టుకునేలా విజయ్‌తో ఆయన సన్నిహితుడైన ఓ ఆడిటర్ చర్చలు జరుపుతున్నట్టు రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దీనిపై విజయ్ పార్టీ ముఖ్యనేతలకు, సన్నిహితులకు స్పష్టత ఇచ్చినట్లు సమాచారం.
ఈ వార్తలు కూడా చదవండి
రాహుల్‌గాంధీ కుటుంబానికి ఆర్‌ఎస్ఎస్, బీజేపీలు బద్ధ శత్రువులే కదా
ఉద్యోగాల్లేకనే యువత డ్రగ్స్‌కు బానిసలు
Read Latest Telangana News and National News
Updated Date - May 01 , 2025 | 12:30 PM