ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

India Pak War: పాకిస్తాన్‌పై మెరుపుదాడి, 30 మంది ఉగ్రవాదులు హతం..

ABN, Publish Date - May 07 , 2025 | 07:20 AM

జమ్మూ కాశ్మీర్‌ పహల్గాంలో ఇటీవల జరిగిన దారుణమైన ఉగ్రదాడికి భారత సైన్యం దీటుగా జవాబు ఇస్తోంది. ఐరాస నిషేధించిన ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం దాడులు చేపడుతోంది. ‘‘ఆపరేషన్‌ సింధూర్’’ పేరుతో పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాలపై ఆర్మీ, ఎయిర్‌ ఫోర్స్‌, నేవీ సంయుక్తంగా మెరుపు దాడులు చేపడుతోంది.

జమ్మూ కాశ్మీర్‌ పహల్గాంలో ఇటీవల జరిగిన దారుణమైన ఉగ్రదాడికి భారత సైన్యం దీటుగా జవాబు ఇస్తోంది. ఐరాస నిషేధించిన ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం దాడులు చేపడుతోంది. ‘‘ఆపరేషన్‌ సింధూర్’’ పేరుతో పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాలపై ఆర్మీ, ఎయిర్‌ ఫోర్స్‌, నేవీ సంయుక్తంగా మెరుపు దాడులు చేపడుతోంది. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌తో పాటూ పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేశాయి. బహావల్‌పూర్, కోట్లీ, ముజఫరాబాద్‌పై క్షిపణి దాడులు జరిగాయి. ఈ దాడుల్లో 30 మంది ఉగ్రవాదులు మృతి చెందినట్లు తెలుస్తోంది. 2019లో బాలాకోట్‌లో దాడి తర్వాత అతిపెద్ద సైనిక చర్య అని తెలుస్తోంది. ఉదయం 11గంటలకు సీసీఎస్ అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. సీసీఎస్ భేటీ అనంతరం కేంద్ర కేబినెట్ సమావేశం కానున్నట్లు తెలుస్తోంది.


యూరీ సెక్టార్‌లో పాక్ కాల్పులు

భారత్ మెరుపుదాడుల నేపథ్యంలో (India Pak War) పాకిస్తాన్ సైన్యం LOC వెంట గ్రామాలపై విచక్షణారహితంగా కాల్పులు జరుపుతోంది. పాక్ సైన్యం కాల్పుల్లో ముగ్గురు పౌరులు మృతి చెందినట్లు చెందినట్లు తెలుస్తోంది. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మరోవైపు పాకిస్తాన్ కాల్పులకు భారత సైన్యం దీటుగా జవాబు ఇస్తోంది.

Updated Date - May 07 , 2025 | 07:20 AM