ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Landslide: మిలటరీ క్యాంపుపై కొండచరియలు.. ముగ్గురు మృతి

ABN, Publish Date - Jun 02 , 2025 | 02:41 PM

సిక్కింలో గత వారం రోజులుగా ఎడతెగని వర్షాలు కురుస్తుండటంతో కొండచరియలు విరిగిపడుతున్నాయి. తీస్తా నది ప్రమాదకర స్థాయి దాటి ప్రవహిస్తుండటంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాలను అప్రమత్తం చేశారు. నార్త్ సిక్కింలోని తీంగ్, చుంగ్‌తాంగ్‌లో కొండ చరియలు విరిగిపడటంతో పలు రోడ్లు మూసివేశారు.

సిక్కిం: ఈశాన్య భారతంలో వర్షాలు బెంబేలెత్తిస్తున్నాయి. సిక్కిం (Sikkim)లోని ఛటేన్‌లో మిలటరీ క్యాంపుపై కొండచరియలు (Landslides) విరిగిపడటంతో ముగ్గురు భద్రతా సిబ్బంది మృతిచెందగా.. ఆరుగురి జాడ గల్లంతయింది. ఆదివారం రాత్రి 7 గంటల ప్రాంతంలో భారీగా వర్షాలు కురియడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు రక్షణ శాఖ అధికారి ఒకరు సోమవారం నాడు ప్రకటన జారీ చేశారు.


తక్షణ సహాయక చర్యలు చేపట్టామని, ఇంతవరకూ మూడు మృతదేహాలను వెలికి తీశామని సదరు అధికారి వెల్లడించారు. నలుగురికి స్వల్ప గాయాలయినట్టు చెప్పారు. జాడగల్లంతైన ఆరుగురి కోసం గాలిస్తున్నామని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.


సిక్కింలో గత వారం రోజులుగా ఎడతెగని వర్షాలు కురుస్తుండటంతో కొండచరియలు విరిగిపడుతున్నాయి. తీస్తా నది ప్రమాదకర స్థాయి దాటి ప్రవహిస్తుండటంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాలను అప్రమత్తం చేశారు. నార్త్ సిక్కింలోని తీంగ్, చుంగ్‌తాంగ్‌లో కొండచరియలు విరిగిపడటంతో పలు రోడ్లు మూసివేశారు.


కాగా, అసోం, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర, మిజోరాం, నాగాలాండ్, మేఘాలయాలోనూ భారీ వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. అసోంలోని పలు ప్రధాన నదులు ప్రమాదకరస్థాయిని దాటి ప్రవహిస్తుండటంతో 20కి పైగా జిల్లాల్లో వరదనీటితో ప్రజలు ఇక్కట్లుపడుతున్నారు. నైరుతి రుతుపవనాలు రావడంతో ప్రపంచంలోనే అత్యధిక వర్షపాతం అరుణాచల్ ప్రదేశ్‌లో నమోదయిన్నట్టు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వం అవసరమైన సహాయక చర్యలు చేపడుతోందని చెప్పారు.


ఇవి కూడా చదవండి..

ఆపరేషన్‌ సిందూర్‌పై వ్యాసరచన పోటీలు

ఆర్మీలో క్రమశిక్షణే ముఖ్యం.. మతం కాదు

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 02 , 2025 | 03:22 PM