Home » Landslides
సిక్కింలోని నాగా ఫారెస్ట్ ప్రాంతంలో భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. దీనివల్ల చ్యాకోంగ్ నదితో పాటు తీస్తా నది ప్రవాహానికి కూడా పాక్షికంగా ఆటంకం ఏర్పడింది. గతంలో తీస్తా నదికి వచ్చిన విపత్తుల దృష్ట్యా స్థానిక ప్రజల్లో ఆందోళన నెలకొంది.
పశ్చిమ బెంగాల్‌లోని కలింపాంగ్ జిల్లాలో భారీ కొండచరియలు విరిగిపడటంతో ఓ బైకర్ త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. బిందు ప్రాంతంలో ఒక్కసారిగా కొండపై నుంచి మట్టి, రాళ్లు, శిథిలాలు..
ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు తీవ్ర విధ్వంసానికి దారితీశాయి. కేదార్ లోయలోని టిమ్లీ-బడ్మా రహదారిపై భారీ కొండచరియలు విరిగిపడటంతో దాదాపు 80 గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.
కర్ణాటక రాష్ట్రం శివమొగ్గ జిల్లా ఇందిరానగర్‌లో ఘోర విషాద ఘటన చోటుచేసుకుంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఇవాళ (ఆదివారం) ఓ కుటుంబం బలైంది. ఈరోజు తెల్లవారుజామున కొండచరియలు విరిగిపడటంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
కుటుంబాన్ని బాగా చూసుకునేందుకు అతడు సౌదీ అరేబియాలో 28 ఏళ్ల పాటు కష్టపడ్డాడు. అక్కడ సంపాదించిన డబ్బులతో స్వదేశానికి తిరిగి వచ్చి అందమైన ఇల్లు కట్టుకున్నాడు. స్థానికులు ఆ ఇంటిని 'తాజ్‌మహల్' అని పిలిచేవారు.
నాగాలాండ్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా మోన్ జిల్లాలో భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘోర ప్రమాదంలో పిల్లలు సహా ఎనిమిది మంది మరణించినట్టు సమాచారం.
కేరళంలోని వయనాడ్ జిల్లాలో భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడ్డాయి. మెప్పాడి సమీపంలోని కల్లాడి వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ఐదుగురు కార్మికులు మృతిచెందగా, పలువురు గల్లంతయ్యారు.
హిమాచల్ ప్రదేశ్లో ఘోరం జరిగింది. కొండ చరియలు ఒక ప్రయివేటు బస్సు మీద విరిగిపడి 15 మంది మరణించారు. ఇప్పటివరకు 15 మంది మృతదేహాలు..
పలు ప్రాంతాల్లో ఎమర్జెన్సీ వాహనాలు చేరుకునేందుకు అంతరాయం కలుగుతుండటంతో హెలికాప్టర్లను రంగంలోకి దింపినట్టు అధికారులు తెలిపారు. పలు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన టూరిస్టులకు సాయపడేందుకు డార్జిలింగ్ పోలీసులు హెల్ప్‌లైన్ నెంబర్లు జారీ చేశారు.
ధార్వాడ్ థత్ ప్రాంతంలో పెద్దఎత్తున కొండచరియలు విరిగిపడి పలు ఇళ్లు ధ్వంసమయ్యయి. రోడ్డులోని కొంత భాగం దెబ్బతినడంతో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో సహాయ, పునరావాస కార్యక్రమాలకు ఆటంకం కలుగుతోంది.