Landslides: హిమాచల్ ప్రదేశ్లో ఘోరం.. 15 మంది దుర్మరణం!
ABN , Publish Date - Oct 07 , 2025 | 09:10 PM
హిమాచల్ ప్రదేశ్లో ఘోరం జరిగింది. కొండ చరియలు ఒక ప్రయివేటు బస్సు మీద విరిగిపడి 15 మంది మరణించారు. ఇప్పటివరకు 15 మంది మృతదేహాలు..
ఇంటర్నెట్ డెస్క్: హిమాచల్ ప్రదేశ్‌లోని బిలాస్పూర్ జిల్లాలో ఇవాళ (అక్టోబర్ 7) ఘోరం జరిగింది. కొండ చరియలు ఒక ప్రయివేటు బస్సు మీద విరిగిపడి 15 మంది ప్రయాణికులు మృత్యువాత పడ్డారు. ఇప్పటివరకు 15 మంది మృతదేహాలు బయటకు తీశారు. మరికొందరు బస్సులో ఇంకా చిక్కుకుని ఉండగా, ముగ్గుర్ని సురక్షితంగా బయటకు తీయగలిగారు.
ఝండూతా ప్రాంతంలోని బల్లూ బ్రిడ్జ్ సమీపంలో ఈ ఘటన జరిగింది. మరోతన్ నుండి ఘుమార్వీన్ వెళ్తున్న బస్సు ఈ ప్రమాదానికి గురైంది. విషయం తెలుసుకున్న రెస్క్యూ టీమ్‌లు, డిసాస్టర్ మేనేజ్‌మెంట్ సిబ్బంది హుటాహుటీన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి.
గాయపడినవారిని సమీప ఆసుపత్రులకు తరలించారు. ముఖ్యమంత్రి సుఖ్‌విందర్ సింగ్ సుఖూ ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించారు. జిల్లా అధికార యంత్రాంగంతో సంప్రదించి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. మృతుల కుటుంబాలకు అన్ని విధాల సహాయాలు అందిస్తామని ప్రభుత్వం తెలిపింది.
ఈ వార్తలు కూడా చదవండి..
పీఎంఓ పేరిట మోసాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్..!
Read Latest Telangana News And Telugu News