Share News

Defense Ministry competition: ఆపరేషన్‌ సిందూర్‌పై వ్యాసరచన పోటీలు

ABN , Publish Date - Jun 02 , 2025 | 05:28 AM

రక్షణశాఖ పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా నిర్వహించిన ఆపరేషన్‌ సిందూర్‌పై జూన్ 1 నుండి 30 వరకు వ్యాస రచన పోటీలను నిర్వహిస్తోంది. ఈ పోటీలో విజేతలకు నగదు బహుమతులు మరియు స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఆహ్వానం కల్పిస్తారు.

Defense Ministry competition: ఆపరేషన్‌ సిందూర్‌పై వ్యాసరచన పోటీలు

ఎంట్రీలను ఆహ్వానించిన రక్షణశాఖ.. ముగ్గురు విజేతలకు రూ.10 వేల నగదు బహుమతి

న్యూఢిల్లీ, జూన్‌ 1: పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్‌పై నిర్వహించిన ఆపరేషన్‌ సిందూర్‌పై రక్షణశాఖ వ్యాసరచన పోటీలు నిర్వహిస్తోంది. ఈ నెల ఒకటో తేదీ (ఆదివారం) నుంచి 30 వరకూ ఆసక్తి గల వారు ఈ వ్యాస రచన పోటీల్లో పాల్గొనవచ్చు. ఈ పోటీల్లో విజేతలైన ముగ్గురికి రూ.10 వేల చొప్పున నగదు బహుమతితోపాటు వారికి ఆగస్టు 15న ఎర్రకోట వద్ద జరిగే 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ఆహ్వానం ఉంటుంది. ‘ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్‌ విధానాన్ని పునర్నిర్వచించిన ఆపరేషన్‌ సిందూర్‌’ అనే పేరుతో ప్రతి ఒక్కరూ ఒక్క ఎంట్రీ మాత్రమే పంపాల్సి ఉంటుందన్న రక్షణశాఖ.. హిందీ లేదా ఇంగ్లీ్‌షలో మాత్రమే వ్యాసం రాయాల్సి ఉంటుందని ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ చేసింది. పోటీదారులు తమ ఎంట్రీలను రక్షణ మంత్రిత్వశాఖ లేదా మైగవ్‌ ఇండియా వెబ్‌సైట్‌లకు పంపాల్సి ఉంటుంది.


ఇవీ చదవండి:

చర్చలంటూ జరిగితే పీఓకే పైనే

పక్కా ప్లాన్ ప్రకారమే హత్యలు

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 02 , 2025 | 05:28 AM