ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రాక్టర్‌ను ఢీకొన్న బస్సు.. 10 మంది మృతి..

ABN, Publish Date - Aug 15 , 2025 | 04:57 PM

స్వాతంత్ర్య దినోత్సవం రోజున విషాద ఘటన చోటు చేసుకుంది. పశ్చిమ బెంగాల్‌లోని పుర్బా బర్ధమాన్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానిక జాతీయ రహదారి 19లోని నాలా ఫెర్రీ ఘాట్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది.

స్వాతంత్ర్య దినోత్సవం రోజున విషాద ఘటన చోటు చేసుకుంది. పశ్చిమ బెంగాల్‌లోని పుర్బా బర్ధమాన్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానిక జాతీయ రహదారి 19లోని నాలా ఫెర్రీ ఘాట్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. శుక్రవారం వేకువజాము బర్ధమాన్ నుంచి దుర్గాపూర్ వెళ్తున్న ప్రైవేట్ ప్యాసింజర్ బస్సు ఆగి ఉన్న ట్రాక్టర్‌ను వెనుక వైపు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 10 మంది ప్రయాణికులు మృతి చెందగా.. 35 మందికి గాయాలయ్యాయి.

ప్రయాణికులంతా బిహార్ వాసులని తెలిసింది. వీరంతా గంగా నదిలో పవిత్ర స్నానాలు ఆచరించి తిరిగి వెళ్తున్నారు. ఈ ప్రమాద సమయంలో మొత్తం 45 మంది ప్రయాణికులు బస్సులో ఉన్నారు. చనిపోయిన వారిలో ఎనిమిది మంది పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నారు. అలాగే గాయపడ్డ వారిలో ఆరుగురు పిల్లలు ఉన్నారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే పోలీసులు.. సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి, ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

ఛత్తీస్‌గఢ్‌లో..

ఛత్తీస్‌గఢ్‌లోని రాజ్‌నంద్‌గావ్ జిల్లాలోనూ ఇవాళ(శుక్రవారం) ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ట్రక్కును కారు ఢీకొన్న ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. బాగ్నాడి పోలీస్ స్టేషన్ పరిధి చిర్చారి గ్రామం సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. 25 నుంచి 34 ఏళ్ల మధ్య వయస్సు గల ఏడుగురు స్నేహితులు.. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నుంచి అంతర్రాష్ట్ర పర్యటనకు బయలుదేరారు. ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత.. ఛత్తీ‌స్‌గఢ్ మీదుగా ఒడిశాలోని పూరికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కారు డ్రైవర్ నిద్రమత్తులో ఉండడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసుల దర్యాప్తులో తేలింది. డ్రైవర్ నిద్రలోకి జారుకోగానే వాహనం డివైడర్‌ను దూకి ఎదురుగా ఉన్న లేన్‌లోకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొట్టింది. దీంతో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. తీవ్రంగా గాయపడ్డ డ్రైవర్‌కు చికిత్స అందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఎర్రకోటకు వెళ్లని రాహుల్, ఖర్గే.. కారణం ఇదేనా?..

దేశ్ రంగీల పాటకు రిహార్సల్స్.. డ్యాన్స్ అదరగొట్టిన ఉపాధ్యాయుడు

మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Aug 15 , 2025 | 06:07 PM