Ethel Caterham: ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలిగా రికార్డు
ABN, Publish Date - Aug 22 , 2025 | 08:23 AM
ఎథెల్ కాటర్‌హామ్.. మళ్లీ వార్తల్లో నిలిచారు. ఆమె గతంలో భారత్‌కు సైతం విచ్చేశారు. కొన్ని నెలలు పాటు ఆమె భారత్‌లో ఉన్నారు. అనంతరం స్వదేశాని వెళ్లిపోయారు.
లండన్, ఆగస్టు 22: ఎథెల్ కాటర్‌హామ్.. ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలిగా ఖ్యాతి గాంచారు. ఆమె.. తన 116వ జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. గురువారం అంటే.. ఆగస్టు 21వ తేదీ సర్రేలో లైట్‌వాటర్‌లోని సంరక్షణ కేంద్రంలో ఆమె ఈ వేడుకులు చేసుకున్నారు. తన కుటుంబ సభ్యులతో కలిసి ఆమె చాలా సాదా సీదాగా ఈ జన్మదినాన్ని జరుపుకున్నారని హల్‌మార్క్ కేర్ హోమ్స్ శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఎథెల్ పుట్టిన రోజు సందర్భంగా ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. దీంతో ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారందరికి ఎథెల్ కుటుంబ సభ్యులు పేరుపేరునా కృతజ్జతలు తెలియజేశారు. అయితే ఈ ఏడాది జన్మదినం సందర్భంగా ఎథెల్ కేటర్ హామ్ ఎవరికి ఎటువంటి ఇంటర్వ్యూలు ఇవ్వ లేదు. అయితే కింగ్ చార్లెస్- 3 ఆమెతో మాట్లాడటానికి సిద్ధంగా ఉంటే అంగీకరిస్తామని సంరక్షణ కేంద్రం వివరించింది.
ఇక దేశంలో 100వ జన్మదిన వేడుకలు జరుపుకునే పౌరులను అభినందిస్తూ.. వ్యక్తిగతంగా బ్రిటన్ చక్రవర్తి లేఖ రాస్తారు. ఆ క్రమంలో ఎథెల్ కాటర్‌హామ్‌కు గతేడాది 115వ పుట్టిన రోజు సమయంలో కింగ్ చార్లెస్ 3 లేఖ రాశారు. ఈ సందర్భంగా ఆమెను అభినందనలతో ముంచెత్తారు.
1909, ఆగస్టు 21వ తేదీన ఎథెల్ కాటర్‌హామ్ జన్మించారు. అంటే టైటానిక్ విపత్తుకు సరిగ్గా మూడేళ్ల ముందు ఆమె జన్మించారు. ఆమె.. తన 18వ ఏటా భారత్‌కు వచ్చారు. భారత్‌లో ఒక సైనిక కుటుంబానికి సహాయకురాలిగా విధులు నిర్వహించేందుకు ఆమె ఈ దేశానికి విచ్చేశారు. కొద్ది రోజుల తర్వాత ఆమె స్వదేశానికి పయనమయ్యారు.
ఆ కొద్ది రోజులకే ఆమె ఒక పార్టీకి వెళ్లారు. ఆ పార్టీలో నార్మన్ కాటర్‌హామ్‌తో ఆమెకు పరిచయం అయింది. అది కాస్తా ప్రేమగా మారింది. ఈ నేపథ్యంలో1933లో నార్మన్ కాటర్‌హామ్‌తో ఆమెకు వివాహం జరిగింది. అనంతరం ఆ జంట హాంకాంగ్‌కు తరలి వెళ్లింది. ఆ తర్వాత జిబ్రాల్టర్‌కు మకాం మార్చింది. .చివరకు దక్షిణ ఇంగ్లాడ్‌లో స్థిరపడ్డింది. అయితే 1976లో భర్త నార్మన్ కాటర్ హామ్ మరణించారు. ఇక ఎథెల్ కాటర్‌హామ్‌కు ముగ్గురు మనవళ్లతోపాటు ఐదుగురు ముని మనవళ్లు ఉన్నారు.
ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలు ఇనా కాన్‌బారో లూకాస్. ఆమె వయస్సు 116వ సంవత్సరాలు. నన్‌గా పని చేసే ఆమె 116వ ఏటా మరణించింది. ఈ నేపథ్యంలో ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలిగా ఎథెల్ కాటర్‌హామ్ ఖ్యాతి పొందారు.
ఇవి కూడా చదవండి
నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు..
మరిన్ని అంతర్జాతీయ వార్తలు, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Aug 22 , 2025 | 08:45 AM