CM Chandrababu: నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు..
ABN , Publish Date - Aug 22 , 2025 | 07:36 AM
ఇవాళ(శుక్రవారం) మధ్యాహ్నం 2 గంటలకు కేంద్ర మంత్రి నిర్మలతో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. రాష్ట్రంలో చేపడుతున్న పలు అభివృద్ది కార్యక్రమాలకు కేంద్ర మంత్రికి వివరించి ఆర్థిక సాయం కోరనున్నారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకురావడానికి టీడీపీ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టే పనిలో పడ్డారు నాయకులు. దానికోసం రాష్ట్ర మంత్రులు, సీఎం చంద్రబాబు కేంద్రమంత్రులతో సమావేశాలు నిర్వహిస్తూ.. రాష్ట్ర సమస్యలను వివరిస్తూ.. పరిష్కరించాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో నేడు సీఎం చంద్రబాబు మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు. అక్కడ పలువురు కేంద్రమంత్రులను ఆయన కలవనున్నారు.
ఢిల్లీ పర్యటనలో భాగంగా.. ఇవాళ(శుక్రవారం) మధ్యాహ్నం 2 గంటలకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. రాష్ట్రంలో చేపడుతున్న పలు అభివృద్ది కార్యక్రమాలకు కేంద్ర మంత్రికి వివరించి ఆర్థిక సాయం కోరనున్నారు. పూర్వోదయ పథకం తరహాలో కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా రాష్ట్రానికి నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేయనున్నారు. అనంతరం 3.15 నిమిషాలకు నీతి ఆయోగ్ చైర్మన్ అరవింద్ పనగారియాతో ఆయన భేటీ అవుతారు. ఆయన పలు కీలక చర్చలు జరిపిన తరువాత సాయంత్రం 5 గంటలకు ఢిల్లీలోని ఓ ప్రైవేటు హోటల్‌లో 'ఎకనమిక్ టైమ్స్' నిర్వహించే వరల్డ్ లీడర్స్ ఫోరం సదస్సుకు ముఖ్యమంత్రి హాజరుకానున్నట్లు సమాచారం.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆరు నెలలకే పుట్టిన శిశువుకు ప్రాణం పోసి..