-
Shashi Tharoor In Colombia: కొలంబియాను కడిగిపారేసిన శశిథరూర్..
ABN, Publish Date - May 30 , 2025 | 12:21 PM
కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ నేతృత్వంలోని అఖిలపక్ష పార్లమెంటరీ ప్రతినిధి బృందం కొలంబియా పర్యటన హాట్ హాట్‌గా సాగింది. ఆ దేశ గడ్డపైనే కొలంబియా స్పందించిన తీరును శశిథరూర్ తూర్పారపట్టారు.
Shashi Tharoor In Colombia
ఇంటర్నెట్ డెస్క్: కొలంబియా(Colombia) దేశపు తీరు తమను తీవ్ర నిరాశ, ఆశ్చర్యానికి గురి చేసిందని కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు (MP) శశి థరూర్(Shashi Tharoor) వ్యాఖ్యానించారు. కొలంబియా గడ్డపై అడుగుపెట్టి ఆ దేశం చేసిన నిర్వాకాన్ని ఎత్తిచూపే ప్రయత్నం చేశారు శశిథరూర్. ఆపరేషన్ సిందూర్ అనంతరం వివిధ దేశాల్లో పర్యటిస్తూ భారత వైఖరిని చాటిచెబుతున్నశశిథరూర్ నేతృత్వంలోని అఖిలపక్ష పార్లమెంటరీ ప్రతినిధి బృందం నిన్న (మే 29)న కొలంబియాకు చేరుకుంది.
పహల్గాం ఉగ్రదాడి అనంతరం పాకిస్థాన్, పీవోకేలోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ కచ్చితమైన క్షిపణి దాడులు జరిపిన సంగతి తెలిసిందే. అయితే, ఈ దాడులకు సంబంధించి పాకిస్థాన్‌లో జరిగిన ప్రాణనష్టంపై తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ కొలంబియా ప్రభుత్వం తన స్పందన తెలియజేసింది. అయితే, కొలంబియా ప్రభుత్వ స్పందన తమను తీవ్ర ఆశ్చర్యానికి గురి చేసిందని శశిథరూర్ ఆ దేశానికే తెలియ చెప్పే ప్రయత్నం చేశారు. ఉగ్రవాద దాడిలో ప్రాణాలు కోల్పోయిన అమాయక బాధితుల పట్ల సానుభూతి వ్యక్తం చేయడానికి బదులుగా కొలంబియా ప్రభుత్వం ఉగ్రమూకల మృతికి సంతాపం, సానుభూతి తెలపడం వింతగా ఉందని శశిథరూర్ వ్యాఖ్యానించారు.
ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా భారత్ చేపట్టిన దాడుల్లో జరిగిన ప్రాణనష్టంపై కొలంబియా హృదయపూర్వక సంతాపాన్ని వ్యక్తం చేయడం విడ్డూరంగా అనిపించిందని శశిథరూర్ ఆ దేశం ముందే కుండబద్దలు కొట్టారు. ఉగ్రవాదాన్ని ప్రేరేపించే వాళ్లకి, వాటిని ప్రతిఘటించే వాళ్లకి ఎప్పుడూ సమానత్వం ఉండదని, ఉండకూడదని శశిథరూర్ అన్నారు. కొలంబియా మాదిరే భారత్ కూడా అనేక ఉగ్రవాద దాడులను ఎదుర్కొందని ఆయన గుర్తు చేశారు. దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఈ దుర్మార్గాల్ని భరిస్తూ వస్తున్నామని శశిథరూర్ చెప్పుకొచ్చారు. ఉగ్రవాదం విషయంలో కొలంబియా వైఖరేంటనే రీతిలో శశిథరూర్ ప్రసంగం సాగింది.
ఇవి కూడా చదవండి
బాత్‌రూమ్‌లో నీళ్లు లేవు.. మండిపడ్డ నటి
ఈ ఔషధాలను పరిమితికి మించి వాడుతున్నారా.. కిడ్నీలు రిస్క్‌లో పడ్డట్టే
Read Latest Telangana News And Telugu News
Updated Date - May 30 , 2025 | 02:37 PM