Share News

Video Viral: బాత్‌రూమ్‌లో నీళ్లు లేవు.. మండిపడ్డ నటి

ABN , Publish Date - May 30 , 2025 | 08:57 AM

సినిమా నటికి వింత అనుభవం ఎదురైంది. ఎయిర్‌పోర్టులో వాష్‌ రూమ్‌కు వెళ్లిన నటికి అక్కడ నీరు రాకపోవడంతో తీవ్ర అసహనానికి గురైంది. అందుకు ఆమె స్పందించిన వీడియో సోషల్ మీడియలో వైరల్ అయింది.

Video Viral: బాత్‌రూమ్‌లో నీళ్లు లేవు.. మండిపడ్డ నటి
Actress Hina Khawaja Bayat

ఇస్లామాబాద్, మే 30: పాకిస్థానీ నటి హీనా ఖవాజా బయాత్‌కు వింత పరిస్థితి ఎదురైంది. ఎయిర్‌పోర్ట్‌లోని వాష్ రూమ్‌లోకి వెళ్లిన ఆమెకు అక్కడ నీరు రాలేదు. దీంతో ఆమె తీవ్ర అసహనానికి గురైంది. అనంతరం ఆమె ఈ ఘటనపై ఆమె స్పందిస్తూ విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కరాచీలోని జిన్నా ఎయిర్‌పోర్ట్‌లో మౌలిక సదుపాయాల కల్పించడంలో అధికారులు ఘోరంగా విఫలమైనట్లు పేర్కొంది. దేశం గురించి గర్వపడుతున్న సమయంలో ఎయిర్ పోర్టులో కనీస నీటి సదుపాయం సైతం లేదని ఆమె పేర్కొంది. ప్రజలు నమాజ్ చేసుకునేందుకే కాదు.. బాత్‌రూమ్‌లో పిల్లలకు సైతం నీరు లేకుండా పోయిందంటూ వాపోయింది. ఆ క్రమంలో ప్రభుత్వానికి పలు ప్రశ్నలను నటి హీనా ఖవాజా బయాత్‌ సంధించింది.


ప్రతి ఒక్కరు అభివృద్ధి, మహా అభివృద్ధి అంటూ మాట్లాడుతున్నారన్నారు. కానీ మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టడం లేదంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు.. ఈ దుస్థితిని ఎవరు బాధ్యతగా తీసుకోవడం లేదన్నారు. సేవలు, వ్యవస్థ, మేనేజ్‌మెంట్, నిర్వహణలో లోపాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయని మండిపడ్డారు. తద్వారా సంస్థలు ఘోరంగా దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తం చేశారు. మనం మన తప్పులను సమర్థించుకోవడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. సాధారణ పౌరుల ప్రాథమిక అవసరాలను పట్టించుకోకుండా.. వాటికి బదులు వ్యర్థమైన ప్రయత్నాలకు ప్రాధాన్యత ఇస్తామని నటి హీనా ఖవాజా బయాత్ తెలిపారు.


ఏప్రిల్ 22వ తేదీన జమ్మూ కశ్మీర్‌ అనంతనాగ్ జిల్లాలోని పహల్గామ్‌లో పర్యాటకులే లక్ష్యంగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 26 మంది మృతి చెందారు. అందుకు ప్రతీకారంగా భారత్.. సింధు జలాల ఒప్పందాన్నిరద్దు చేసింది. దీంతో పాకిస్థాన్‌లో నీటి నిల్వలు అడుగంటుతున్నాయి. ఇప్పటికే దేశంలోని వివిధ ప్రాంతాల్లో నీటి ఎద్దడి ఏర్పడింది. అలాంటి వేళ.. నటి హీనా ఖవాజా బయాత్‌కు ఎదురైన పరిస్థితి పాక్‌లోని నీటి ఇక్కట్లకు అద్దం పడుతోందనే చర్చ నడుస్తోంది.


మరోవైపు పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్‌పై భారత్ కఠిన వైఖరి అవలంభించింది. పాకిస్థాన్‌లో చర్చలు జరిపే ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టింది. ఓ వేళ చర్చలు జరిపినా.. పాక్ ఆక్రమిత కాశ్మీర్ అంశంపైన మాత్రమేనని పాకిస్థాన్‌కు స్పష్టం చేసిన విషయం విదితమే.

ఇవి కూడా చదవండి

జోధాతో అక్బర్ పెళ్లి జరగలేదు.. రాజస్థాన్ గవర్నర్ సంచలన వ్యాఖ్యలు..

రోడ్డుపై బరితెగించిన ఆటో డ్రైవర్.. ప్రాణాలు తీసే స్టంట్.

For International News And Telugu News

Updated Date - May 30 , 2025 | 11:24 AM