ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Dmitry Luchin: వెన్నుల్లో వణుకుపుట్టిస్తున్న హత్య.. చావే భయపడేలా..

ABN, Publish Date - Dec 17 , 2025 | 09:55 PM

ఈ మధ్య కాలంలో కొంతమంది సైకోల్లా మారుతూ తమ భాగస్వామిని అతి దారుణంగా హత్య చేసి శరీరాన్ని ముక్కలుగా నరుకుతున్న ఘటనలు ఎన్నో చూస్తున్నాం. రష్యాలో ఓ వ్యక్తి చేసిన దారుణం గురించి వింటే వెన్నుల్లో వణుకు పుడుతుంది..వీడు మనిషా లేక నరమాంస భక్షకుడా అన్న అనుమానం వస్తుంది.

Russian killer Dmitry Luchin Case

డిమిత్రి లుచిన్ (Dmitry Luchin) కేసు ఒక్క రష్యా(Russia)లోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత భయంకరమైన నేరాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ కేసు సామాన్యులకే కాదు.. రష్యా పోలీసు(Russian police)లకు సైతం వెన్నుల్లో వణుకుపుట్టేలా చేసింది. ఇంతకీ డిమిత్రి లుచిన్ ఏం చేశాడు.. అతన్ని మనిషి కాదు ఓ కృర మృగం, నరమాంస భక్షకుడితో ఎందుకు పోల్చుతున్నారో తెలుసుకుందాం.

రష్యా(Russia)లోని వాల్దాయ్ (Valday) నగరంలో అత్యంత ఘోర సంఘటన వెలుగు చూసింది. డిమిత్రి లుచిన్ అనే 23 ఏళ్ల యువకుడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం (International Womens Day) జరుపుకునేందుకు తన 45 ఏళ్ల ప్రియురాలు ఓల్గా బుడునోవా(Olga Budunova)ను కలవడానికి వెళ్లాడు. కానీ.. లుచిన్ మనసులో కృరమైన ఆలోచన ఉంది. సెలబ్రేషన్స్ (Celebrations) జరుపుకుంటున్న సమయంలో ఆమెతో గొడవపడ్డాడు. పక్కనే ఉన్న ఓ బాటిల్ తో ఆమె తలపై కొట్టడంతో అక్కడికక్కడే చనిపోయింది. ఆ తర్వాత లూచిన్ తన వికృత చేష్టలు మొదలు పెట్టాడు. బుడనోవా మెదడు(brain) తీసి పెనంలో కాల్చి తిన్నాడు. ఆమె శరీరం నుంచి వచ్చిన రక్తాన్ని (Blood) గ్లాసులో తీసుకొని తాగాడు. చెవులు కోసి ఒకటి తాను తిని మరొకటి అక్కడే ఉన్న పిల్లి (Cat) కి తినిపించాడు. ఎర్రటి నెయిల్ పాలీష్ (Nail polish) తో ఆమె శరీరంపై అసభ్య పదాలు రాశాడు.

ఈ నేరం తూర్పు యూరోపియన్ (Eastern European) దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. డిమిత్రి లుచిన్ ని విచారిస్తున్న సమయంలో అతని ప్రవర్తన చూసి రష్యా పోలీసులు సైతం షాక్ కు గురయ్యారు. పోలీసుల విచారణ(Police investigation)లో లుచిన్ చెప్పిన విషయాలు ఒళ్లుగగుర్పొడిచే ఉన్నాయి. తనకు ‘నరమాంసం, రక్తం’ రుచి ఎలా ఉంటుందో చూడాలని ఉందని, అందుకే ఈ పని చేశానని ఒప్పుకున్నాడు. ఇంటర్నెట్ (Internet)లో సీరియల్ కిల్లర్ల గురించి చదివి ప్రభావితమయ్యానని తెలిపాడు. అయితే.. లుచిన్ మానసిక పరిస్థితి(Mental State) బాగాలేదని అందరూ భావించారు. కానీ, వైద్య పరీక్షలు నిర్వహించినపుడు, అతడు ఎంతో తెలివిగా జాలీ, దయ లేకుండా హత్య చేశాడని, ఎటువంటి పిచ్చి లేదని వైద్యులు తేల్చారు. లుచిన్ కి సంబంధించిన నేరం రష్యాలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా షాక్‌కి గురి చేసింది.

2018 లో రష్యా కోర్టు (Russian court) అతనికి 19 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. లూచిన్ కి కోర్టు విధించిన శిక్ష చాలా చిన్నదని, అతనికి మరణశిక్ష లేదా జీవితఖైదు విధించాలని ప్రజల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు (protests) చేశారు. డిమిత్రి లుచిన్ ను ‘వరల్డ్ కప్ కిల్లర్’ , ‘కానిబాల్ కిల్లర్’ గా పిలుస్తుంటారు. అప్పట్లో ఈ కేసు ఒక సంచలనం.. కానీ ఇటీవల చాలా మంది ఇలాంటి దారుణాలకు పాల్పడటం చూస్తూనే ఉన్నాం.

ఇవీ చదవండి:

బోండీ బీచ్‌ ఉగ్రవాదికి హైదరాబాద్‌ మూలాలు

మహాత్ముడి ఆదర్శాలకు అవమానం

Updated Date - Dec 17 , 2025 | 10:03 PM