ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

PM Modi Receives Ethiopian Award: పీఎం మోదీకి ఇథియోపియా అత్యున్నత పురస్కారం

ABN, Publish Date - Dec 17 , 2025 | 12:23 PM

విదేశీ పర్యటనలో ఉన్న భారత ప్రధాని మోదీ మరో గౌరవం పొందారు. ఆయనకు ఇథియోపియా దేశ అత్యున్నత పురస్కారం లభించింది.

PM Modi Receives Ethiopian Award

ఇంటర్నెట్ డెస్క్: భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఇథియోపియా దేశ అత్యున్నత పురస్కారం వరించింది. అదిస్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్‌లో మంగళవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆ దేశ ప్రధాని డాక్టర్ అబి అహ్మద్ అలీ.. 'ది గ్రేట్ ఆనర్ ఆఫ్ నిషాన్ ఆఫ్ ఇథియోపియా' అవార్డుతో మోదీని సత్కరించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ స్పందిస్తూ.. భారతీయులందరి తరఫునా ఈ అవార్డు స్వీకరిస్తున్నానన్నారు. భారత్-ఇథియోపియా బంధాలను పటిష్ఠం చేసేందుకు సహకరించిన ఎందరో భారతీయులకు ఇది గుర్తింపు అభివర్ణించిన మోదీ.. ఆ దేశ ప్రధాని అబీ అహ్మద్ అలీకి కృతజ్ఞతలు తెలిపారు.

మోదీ.. తన తొలి ద్వైపాక్షిక పర్యటనలో భాగంగా ఇథియోపియా రాజధాని అదిస్ అబాబా చేరుకున్నారు. అంతకముందు.. విమానాశ్రయంలో ఆయనకు అబీ అహ్మద్ అలీ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఇరు దేశాల ప్రధానుల మధ్య పరస్పర ప్రయోజనకర విస్తృత స్థాయి ద్వైపాక్షిక చర్చలు జరిగాయి.

ఇథియోపియాకు వెళ్లడానికి ముందు జోర్డాన్‌ దేశంలో పర్యటించారు మోదీ. ఆ దేశ రాజధాని అమ్మాన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. రానున్న ఐదేళ్లలో భారత్-జోర్డాన్ ద్వైపాక్షిక వాణిజ్య బంధాన్ని రెట్టింపు చేసి 500 కోట్ల డాలర్ల స్థాయికి చేరుకునేలా ప్రయత్నం చేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. భారతదేశ ఆర్థికాభివృద్ధిలో భాగస్వామ్యం వహించి లబ్ధి పొందాలని ఆ దేశ వాణిజ్య సంస్థలను కోరారు మోదీ. ఈ కార్యక్రమంలో ఆ దేశ యువరాజు హుసేన్ సహా వాణిజ్య, పరిశ్రమల శాఖల విభాగాధిపతులు పాల్గొన్నారు.

ఇవీ చదవండి:

బోండీ బీచ్‌ ఉగ్రవాదికి హైదరాబాద్‌ మూలాలు

మహాత్ముడి ఆదర్శాలకు అవమానం

Updated Date - Dec 17 , 2025 | 12:26 PM