ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

North Korea Missile Base: నార్త్ కొరియా రహస్య క్షిపణి స్థావరం.. అమెరికా, ఆసియా దేశాలకు కొత్త టెన్షన్

ABN, Publish Date - Aug 21 , 2025 | 03:10 PM

ఉత్తర కొరియా గురించి కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. ఇటీవల, చైనా సరిహద్దు సమీపంలో ఓ రహస్య క్షిపణి స్థావరం నిర్మించిందని తెలిసింది. ఈ స్థావరం గురించి తెలిసిన అమెరికా సహా ఇతర దేశాలు ఆందోళన చెందుతున్నాయి.

North Korea Missile Base

ఉత్తరకొరియా మళ్లీ వార్తల్లోకి వచ్చింది. కానీ ఈసారి ఈ దేశ చర్యల గురించి తెలిస్తే అమెరికా, చైనా మాత్రమే కాదు, ఆసియా దేశాలు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. ఎందుకంటే వాషింగ్టన్‌లో ఉన్న సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ (CSIS) అనే సంస్థ ఇటీవల ఓ రహస్య నివేదికను విడుదల చేసింది.

దాని ప్రకారం నార్త్ కొరియా చైనా సమీపంలోని సరిహద్దు ప్రాంతంలో ఓ రహస్య క్షిపణి, మిలిటరీ స్థావరాన్ని ఏర్పాటు (North Korea Missile Base) చేసింది. ఈ స్థావరం పేరు సిన్‌పుంగ్‌డాంగ్ మిస్సైల్ ఆపరేటింగ్ బేస్. ఇది చైనా సరిహద్దు నుంచి కేవలం 27 కిలోమీటర్ల దూరంలోనే ఉంది.

2014లోనే పూర్తి..

ఈ బేస్ నిర్మాణం 2004లో ప్రారంభమై, 2014 నాటికి పూర్తిగా పని చేయగల స్థాయికి చేరుకుందని CSIS చెబుతోంది. 2003 నుంచే ఉపగ్రహ చిత్రాల ద్వారా ఈ స్థావరాన్ని గమనించామని చెబుతున్నారు. ఈ స్థావరంలో నార్త్ కొరియా ఆధునిక, అతి శక్తివంతమైన దీర్ఘదూర క్షిపణులను ఉంచినట్టు సమాచారం. వీటిలో హ్వాసోంగ్-15, హ్వాసోంగ్-18 అనే ఇంటర్‌కాంటినెంటల్ బాలిస్టిక్ మిస్సైళ్లు ఉన్నాయి. ఇవి న్యూక్లియర్ బాంబులను మోయగల శక్తిని కల్గి ఉన్నాయి. అంటే నార్త్ కొరియా నుంచి అమెరికాకు ఈజీగా దాడులు చేసే ఛాన్సుంది.

ఎక్కడి నుంచైనా దాడి చేయగల సత్తా

ఈ స్థావరంలో ప్రత్యేకమైన TEL (Transporter-Erector-Launcher) లేదా MEL వాహనాలు ఉన్నాయి. వీటి సహాయంతో క్షిపణులు అవసరమైన చోటు నుంచి ఎక్కిడికైనా ప్రయోగించుకోవచ్చు. ఇది నార్త్ కొరియా మిస్సైల్ స్ట్రాటజీలో భాగంగా ఉంది. యుద్ధ సమయంలో ముందే నిర్ణయించిన ప్రాంతాల నుంచి ప్రయోగాలు చేయడానికి వీలుగా ప్లాన్ చేశారు. సిన్‌పుంగ్‌డాంగ్ మాత్రమే కాదు. హోజుంగ్, సాంగ్నామ్, యోంగ్నిమ్ వంటి మరెన్నో మిస్సైల్ ప్రాంతాలు కూడా ఉన్నాయని ఈ నివేదిక చెబుతోంది. ఇవన్నీ కలిపి నార్త్ కొరియా స్ట్రాటజిక్ మిస్సైల్ బెల్ట్ అని చెబుతున్నారు.

పెద్ద ప్లాన్..

ఇవన్నీ స్థావరాలు కలిపి దాదాపు 10,000 మంది సైనికులు పనిచేసే ఒక ప్రత్యేక విభాగంగా ఏర్పాటయ్యాయి. అన్ని మిస్సైల్ బేసులు, వాటి నిర్వహణ, స్టోరేజ్, వార్‌హెడ్ సహా అనేక పనులను వీరంతా చూసుకుంటారు. ఈ స్థావరం గతంలో డిన్యూక్లియర్ చర్చల్లో లేదు. అంటే అమెరికా, దక్షిణ కొరియాతో జరిగిన చర్చల్లో ఇది ఎప్పుడూ ప్రస్తావనకు రాలేదు. దీంతో ఇంత శక్తివంతమైన బేస్ బయటపడటంతో అమెరికా సహా తూర్పు ఆసియా దేశాలకు టెన్షన్ మొదలైంది.

ఇవి కూడా చదవండి

అర్జెంటుగా డబ్బు అవసరం.. పర్సనల్ లోన్ తీసుకోవాలా? గోల్డ్ బెటరా?

మీ లోన్ ఇంకా మంజూరు కాలేదా..ఇవి పాటించండి, వెంటనే అప్రూవల్

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 21 , 2025 | 03:42 PM