ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Gautam Aggarwal: భవిష్యత్‌లో డెబిట్, క్రెడిట్ కార్డులు ఉండవు: మాస్టర్ కార్డ్ సీఈఓ

ABN, Publish Date - Oct 18 , 2025 | 08:35 PM

భవిష్యత్ లో క్రెడిట్, డెబిట్ కార్డులు కనిపించక పోవచ్చు. లావాదేవీలన్నీ డిజిటల్ గా మారిపోనున్నాయి. ఈ విషయాన్ని స్వయంగా మాస్టర్ కార్డు సౌత్ ఆసియా సీఈఓ గౌతమ్ అగర్వాల్ వెల్లడించారు.

Credit, Debit Cards

నేటికాలంలో చాలమంది డెబిట్, క్రెడిట్ కార్డులను విరివిరిగా వినియోగిస్తున్నారు. ప్రతి ఒక్కరి పర్పసులో ఈ కార్డులు ఉంటాయి. అయితే భవిష్యత్ లో ఈ కార్డులు కనిపించక పోవచ్చు. లావాదేవీలన్నీ డిజిటల్ గా మారిపోనున్నాయి. ఈ విషయాన్ని స్వయంగా మాస్టర్ కార్డు సౌత్ ఆసియా సీఈఓ గౌతమ్ అగర్వాల్ వెల్లడించారు. 'ఎన్‌డీటీవీ వరల్డ్ సమ్మిట్ 2025'లో పాల్గొన్న ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్ చెల్లింపుల వ్యవస్థ స్వరూపాన్ని వివరించారు.

రానున్న రోజుల్లో కార్డులు(Credit, Debit Cards) ప్రస్తుతం ఉన్న ప్లాస్టిక్ రూపంలో ఉండవని ఆయన స్పష్టం చేశారు. మన కార్డులను ఫోన్లు, స్మార్ట్ వాచ్‌లు, చివరికి ఉంగరాల్లోకి కూడా డిజిటల్‌గా మార్చుకోవచ్చని తెలిపారు. భవిష్యత్తులో చెల్లింపుల ప్రక్రియ అనేది మనం ప్రత్యేకంగా చేసే పనిలా కాకుండా, శ్వాస తీసుకున్నంత సహజంగా, మనకు తెలియకుండానే జరిగిపోతుందని ఆయన(Gautam Aggarwal Mastercard CEO) పేర్కొన్నారు. ఈ మార్పుకు ఎంతో కాలం పట్టదని ఆయన అభిప్రాయపడ్డారు. చెల్లింపుల వ్యవస్థలో మరో కీలక మార్పు రానుందని అగర్వాల్ తెలిపారు.

ప్రస్తుతం ప్రతీ ఆన్‌లైన్ లావాదేవీకి వస్తున్న ఓటీపీ (OTP)ల విధానం కూడా భవిష్యత్తులో ఉండదంటూ బిగ్ బాంబ్ పేల్చారు. ఓటీపీల స్థానంలో బయోమెట్రిక్‌ విధానాన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామని, దీనివల్ల లావాదేవీలు మరింత సురక్షితంగా, వేగంగా పూర్తవుతాయని ఆయన పేర్కొన్నారు. ఇదే సమయంలో ఇండియా డిజిటల్ చెల్లింపుల వ్యవస్థపై గౌతమ్ అగర్వాల్ ప్రశంసలు కురిపించారు. ప్రపంచంలోనే అత్యంత ఆధునిక చెల్లింపుల వ్యవస్థ భారత్‌(India)లోనే ఉందని తెలిపారు. ఇక్కడి కొత్త విషయాలను కనిపెట్టే వారు, ప్రగతిశీల నియంత్రణ సంస్థ, అందరి సహకార మనోభావమే ఇందుకు కారణమని కొనియాడారు. అయితే, ఇండియా ఇప్పటివరకు సాధించింది చాలా తక్కువ అని, డిజిటల్ చెల్లింపుల రంగంలో దేశానికి ఇంకా అపారమైన అవకాశాలు ఉన్నాయని అగర్వాల్(Gautam Aggarwal) ప్రశంసించారు.

ఇవి కూడా చదవండి:

పోక్సో కేసుల పరంపర.. తల్లిదండ్రుల ఆందోళన

పద్మశ్రీ అవార్డు గ్రహీత మొగులయ్యకు కేటీఆర్ అండ

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 18 , 2025 | 09:10 PM