Share News

POCSO Cases: పోక్సో కేసుల పరంపర.. తల్లిదండ్రుల ఆందోళన

ABN , Publish Date - Oct 18 , 2025 | 12:14 PM

ముగ్గురు చిన్నారులకు చాక్లెట్లు ఆశ చూపి అశ్లీల వీడియోలు చూపించి లైంగిక దాడికి పాల్పడ్డాడు ఇర్ఫాన్. ఆగస్టులో స్కూల్ సెలవుల సమయంలో ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారులను చాక్లెట్ ఆశ చూపించి లైంగిక దాడి చేశాడు కామాంధుడు.

POCSO Cases: పోక్సో కేసుల పరంపర.. తల్లిదండ్రుల ఆందోళన
POCSO Cases

హైదరాబాద్, అక్టోబర్ 18: నగరంలోని సైదాబాద్‌లో పోక్సో కేసుల పరంపర కొనసాగుతోంది. సైదాబాద్ పోలీస్ స్టేషన్‌లో వరుసగా పోక్సో కేసులు నమోదు అవుతుండటం కలకలం రేపుతోంది. ఇటీవల జువైనల్ హోంలో ఆశ్రయం పొందుతున్న బాలురపై స్టాఫ్ గార్డ్ రెహమాన్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన రాష్ట్రంలో సంచలనం రేపింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు రెహమాన్‌ను అరెస్ట్ చేసి.. అతడిపై సైదాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఐదు పోక్సో కేసులు నమోదు అయ్యాయి. అయితే ఈ ఘటన మరువక ముందే ముగ్గురు చిన్నారులపై పొరుగింట్లో ఉండే ఇర్ఫాన్ అనే లైంగిక దాడికి పాల్పడం సంచలనం రేపింది. ముగ్గురు చిన్నారులకు చాక్లెట్లు ఆశ చూపి అశ్లీల వీడియోలు చూపించి లైంగిక దాడికి పాల్పడ్డాడు ఇర్ఫాన్. ఆగస్టులో స్కూల్ సెలవుల సమయంలో ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారులను చాక్లెట్ ఆశ చూపించి లైంగిక దాడి చేశాడు కామాంధుడు.


అయితే స్కూల్లో పిల్లలు ఎలా పుడతారో తెలుసా అంటూ చిన్నారులు మాట్లాడుకుంటుండగా.. స్కూల్ టీచర్ విని చిన్నారుల తల్లిదండ్రులకు సమాచారం అందించింది. వెంటనే పిల్లలను నిలదీయగా ఇర్ఫాన్ లైంగిక దాడి వెలుగులోకి వచ్చింది. దీనిపై తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక మరో ఘటనలో బాలికపై అత్యాచారం చేసి వేధింపులకు గురి చేస్తున్న యువకుడుపై పోక్సో కేసు నమోదు అయ్యింది. భర్తతో విభేదాల కారణంగా ఓ మహిళ పదిహేనేళ్లుగా కూతురితో కలిసి ఒంటరిగా ఉంటోంది. ఏడాది క్రితం ఒంటరిగా ఉన్న బాలికపై విజయ్ అనే యువకుడు అత్యాచారం చేశాడు. ఆ సమయంలో తీసిన ఫోటోలు, వీడియోలు చూపించి పలుమార్లు అత్యాచారం చేశాడు నీచుడు. చివరకు విషయం బాలిక తల్లికి తెలియడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. బాలిక తల్లి ఫిర్యాదుతో విజయ్‌పై సైదాబాద్ పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు.


ఇవి కూడా చదవండి..

తీవ్ర విషాదం.. నీటి సంపులో పడి నాలుగేళ్ల బాలుడు మృతి

కానిస్టేబుల్ హత్యపై డీజీపీ కీలక ఆదేశాలు..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 18 , 2025 | 12:14 PM