Minister Thummala: బీసీగా మారిన ప్రధాని మోదీ.. బీసీ రిజర్వేషన్లకు అడ్డు పడుతున్నారు..
ABN , Publish Date - Oct 18 , 2025 | 12:02 PM
అందరికీ విద్యా, ఉద్యోగం కల్పించాలని గొప్ప సామాజిక విప్లవం కోసం రాహుల్ గాంధీ మేనిఫెస్టో రూపొందించారని మంత్రి తుమ్మల నాగేశ్వరావు తెలిపారు. కొద్ది తేడాతో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేక పోయిందని అసహనం వ్యక్తం చేశారు.
ఖమ్మం: కులగణన ఆధారంగా బీసీల రిజర్వేషన్ల కోసం శాసనసభలో అన్ని పార్టీల ఆమోదం తీసుకొని హైకోర్టు, సుప్రీంకోర్టు ద్వారా న్యాయం కోసం ముందుకెళ్లామని మంత్రి తుమ్మల నాగేశ్వరావు అన్నారు. సత్తుపల్లిలో చేపట్టిన బీసీ బంద్ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. దేశ ప్రజల మనోభావాలకు తగ్గట్టుగా రాజ్యాంగబద్ధంగా అందరికీ సమన్యాయం జరిగి, రాజ్యాధికారం కల్పించాలనేదే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఉద్దేశమని పేర్కొన్నారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు దేశ ప్రజల కోసం రాహుల్ గాంధీ పాదయాత్ర చేపట్టారని మంత్రి తుమ్మల గుర్తు చేశారు.
అందరికీ విద్యా, ఉద్యోగం కల్పించాలనే గొప్ప సామాజిక విప్లవం కోసం రాహుల్ గాంధీ మేనిఫెస్టో రూపొందించారని మంత్రి తుమ్మల నాగేశ్వరావు తెలిపారు. కొద్ది తేడాతో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేక పోయిందని అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించిన ప్రజలకు ఇచ్చిన మాట ప్రకామరమే.. బీసీ రిజర్వేషన్ల కోసం రాజ్యాంగబద్ధంగా ఉన్న అధికారాలతోనే చట్టం చేశామని పేర్కొన్నారు. చట్టబద్ధత ఇవ్వాల్సిన గవర్నర్లు, రాష్ట్రపతి పట్టించుకోవడం లేదని తుమ్మల ఆరోపించారు. న్యాయబద్ధంగా చట్టసభల్లో అమలు చేసిన కూడా సాంకేతిక కారణాలతో బీసీ రిజర్వేషన్ల అమలుకు అడ్డుపడుతున్నారని మండిపడ్డారు
గుజరాత్ రాష్ట్రంలో చట్ట సవరణ ద్వారానే ప్రధానమంత్రి మోదీ బీసీగా కన్వర్ట్ అయ్యారని మంత్రి తుమ్మల తెలిపారు. నరేంద్ర మోదీ కులం బీసీ కాకపోయినా అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఆయన సామాజిక వర్గాన్ని బీసీలో చేర్చిందని పేర్కొన్నారు. బీసీగా ప్రధానమంత్రి స్థానం దక్కించుకున్న మోదీ, తెలంగాణలో బీసీలకు న్యాయం చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరావు డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి:
ISRO: నవంబరు చివర్లో బ్లూబర్డ్ ప్రయోగం