ISRO: నవంబరు చివర్లో బ్లూబర్డ్ ప్రయోగం
ABN , Publish Date - Oct 18 , 2025 | 05:51 AM
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో వాణిజ్య ప్రయోగానికి సిద్ధమవుతోంది. నవంబరు ఆఖరులో అమెరికాకు చెందిన బ్లూబర్డ్ బ్లాక్-2 కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని శ్రీహరికోట నుంచి...
షార్‌కు చేరిన అమెరికన్ కమ్యూనికేషన్ ఉపగ్రహం
సూళ్లూరుపేట, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో వాణిజ్య ప్రయోగానికి సిద్ధమవుతోంది. నవంబరు ఆఖరులో అమెరికాకు చెందిన బ్లూబర్డ్ బ్లాక్-2 కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని శ్రీహరికోట నుంచి ఎల్‌వీఎం3-ఎం6 రాకెట్ ద్వారా రోదసిలోకి పంపేందుకు రెడీ అవుతోంది. సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి ప్రయోగించనున్న ఈ 6,500 కిలోల బరువైన ఉపగ్రహం తొలుత అమెరికా నుంచి చెన్నైకి చేరగా.. దాన్ని శుక్రవారం తెల్లవారుజామున సీఐఎస్ఎఫ్ భద్రత నడుమ రోడ్డు మార్గాన ప్రత్యేక వాహనంలో షార్‌కు తరలించారు. ఈ ఉపగ్రహంతోపాటు అమెరికాకు చెందిన 8 మంది శాస్త్రవేత్తలు కూడా షార్‌కు చేరుకున్నారు. వీరంతా ప్రయోగం పూర్తయ్యేవరకూ ఇక్కడే ఉంటారు. అమెరికాలోని టెక్సా్‌సకు చెందిన ఏఎ్‌సటీ స్పేస్ మొబైల్ సంస్థ బ్లూబర్డ్ కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని అభివృద్ధి చేసింది. ఈ ఉపగ్రహం ద్వారా టవర్లు లేకుండానే స్మార్ట్ ఫోన్లకు నేరుగా ఇంటర్నెట్, కమ్యూనికేషన్ సేవలందించే విప్లవాత్మక సాంకేతికత అందుబాటులోకి రానుంది. అంతరిక్షం నుంచి సిగ్నల్స్ ద్వారా ఫోన్‌కాల్స్ చేసుకోవచ్చు. భూమికి అతితక్కువ దూరంలోని లియో ఆర్బిట్ నుంచి బ్లూబర్డ్ ఉపగ్రహం పనిచేస్తుంది. ఇస్రోకు ఇది బారీ వాణిజ్య ప్రయోగంగా భావిస్తున్నారు. కాగా.. షార్‌లో ఈ నెల 24న చేపట్టనున్న ఎల్‌వీఎం3-ఎం5 రాకెట్ ప్రయోగం వాయిదా పడినట్లు ఇస్రో వర్గాల సమాచారం.