Nizamabad Constable Murder: కానిస్టేబుల్ హత్యపై డీజీపీ కీలక ఆదేశాలు..
ABN , Publish Date - Oct 18 , 2025 | 09:33 AM
రియాద్‌ను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్‌కు డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. సంఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితులను పర్యవేక్షించాలని మల్టీ జోన్ 1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డికి డీజీపీ సూచించారు.
హైదరాబాద్, అక్టోబర్ 18: నిజామాబాద్ కానిస్టేబుల్ ఇ.ప్రమోద్ హత్యపై తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి (Telangana DGP Shivadher Reddy) సీరియస్ అయ్యారు. నిజామాబాద్ సీసీఎస్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న ప్రమోద్ హత్యపై దర్యాప్తు వేగవంతం చేయాలని డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ ప్రమోద్ మరణం పట్ల డీజీపీ విచారం వ్యక్తం చేశారు. వాహనాల దొంగతనాలను, చైన్ స్నాచింగ్ నేరాలను చేస్తున్న నిందితుడు షేక్ రియాద్‌ను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తీసుకొస్తున్న కానిస్టేబుల్ ప్రమోద్‌ను రియాద్ కత్తితో పొడిచి హత్య చేశాడు. తీవ్రంగా గాయపడిన ప్రమోద్ అక్కడికక్కడ మృతి చెందాడు. హత్య అనంతరం నిందితుడు రియాద్ పరారయ్యాడు.
వెంటనే అప్రమత్తమైన పోలీసులు నిందితుడు షేక్ రియాద్ కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. రియాద్‌ను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్‌కు డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. సంఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితులను పర్యవేక్షించాలని మల్టీ జోన్ 1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డికి డీజీపీ సూచించారు. మరణించిన కానిస్టేబుల్ కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించాలని, వారికి అవసరమైన సహాయం అందించాలని డీజీపీ శివధర్ రెడ్డి ఆదేశించారు.
ఇవి కూడా చదవండి..
స్వగ్రామానికి కట్టా రామ్‌చంద్రారెడ్డి మృతదేహం.. కాసేపట్లో అంత్యక్రియలు
తీవ్ర విషాదం.. నీటి సంపులో పడి నాలుగేళ్ల బాలుడు మృతి
Read Latest Telangana News And Telugu News