Katta Ramchandra Reddy: స్వగ్రామానికి కట్టా రామ్‌చంద్రారెడ్డి మృతదేహం.. కాసేపట్లో అంత్యక్రియలు
ABN , Publish Date - Oct 18 , 2025 | 09:30 AM
సిద్దిపేట కోహెడ మండలం తీగలకుంటపల్లిలో మరికొద్ధిసేపట్లో రామ్ చంద్రారెడ్డి అంత్యక్రియలు జరుగనున్నాయి. తీగలకుంటపల్లి గ్రామానికి చెందిన ఆయన.. ఛత్తీస్‌గఢ్ నారాయణపూర్ జిల్లాలోని అబూజ్ మడ్ అడవుల్లో ఎన్‌కౌంటర్‌లో మృతిచెందారు.
హైదరాబాద్, అక్టోబర్ 18: ఛత్తీస్‌గఢ్‌లో ఇటీవల జరిగిన ఎన్ కౌంటర్ లో మృతిచెందిన మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడు కట్టా రామ్‌చంద్రారెడ్డి మృతదేహం ఎట్టకేలకు స్వగ్రామం చేరుతుంది. తెలంగాణ రాష్ట్రం కోహెడ మండలం తీగలకుంటపల్లి మృతదేహాన్ని తరలించారు కుటుంబసభ్యులు. మరికొద్దిసేపట్లో రామ్ చంద్రారెడ్డి అంత్యక్రియలు జరుగనున్నాయి. తీగలకుంటపల్లి గ్రామానికి చెందిన ఖాతా(కట్ట) రామచంద్రారెడ్డి.. ఛత్తీస్‌గఢ్ నారాయణపూర్ జిల్లాలోని అబూజ్ మడ్ అడవుల్లో ఎన్‌కౌంటర్‌లో మృతిచెందారు.
వరుకోల్ గ్రామంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా, అంతకుముందు సిద్దిపేటలోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో పని చేస్తూ 1989లో రామచంద్రారెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లారు. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నక్సలైట్ల ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. కేంద్ర కమిటీ సభ్యులుగా పని చేస్తూ ఎన్‌కౌంటర్‌లో మరణించారు. దాదాపు నెల రోజుల క్రితం ఎన్‌కౌంటర్‌లో మృతిచెందగా.. ఆయన మరణంపై అనుమానాలతో రీపోస్ట్ మాత్రం చేయాలంటూ ఛత్తీస్‌గఢ్ హైకోర్టును బాధిత కుటుంబసభ్యులు ఆశ్రయించారు.
అయితే హైకోర్టు తీర్పు ఆలస్యం కావడంతో అక్కడే రామచంద్రారెడ్డి అంత్యక్రియలు పూర్తి చేయాలని ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం భావించింది. హైకోర్టు నిర్ణయం వెలువడే వరకూ మృతదేహాన్ని భద్రపరచాలని సుప్రీంకోర్టును రామచంద్రారెడ్డి కుటుంబసభ్యులు ఆశ్రయించారు. హైకోర్టు నిర్ణయం వచ్చే వరకూ డెడ్ బాడీని కాపాడాలని సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చింది. రీపోస్ట్ మార్టం అప్పీల్‌ను హైకోర్టు తిరస్కరించడంతో నెల రోజుల తర్వాత స్వగ్రామానికి రామచంద్రారెడ్డి మృతదేహం వచ్చింది. నేడు తీగలకుంటపల్లిలో రామచంద్రారెడ్డి అంత్యక్రియలు జరుగనున్నాయి.
ఇవి కూడా చదవండి:
Telangana bandh over BC reservations: తెలంగాణ బంద్.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన బస్సులు
Gachibowli: తీవ్ర విషాదం.. నీటి సంపులో పడి నాలుగేళ్ల బాలుడు మృతి