ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

INS Sharda: మాల్దీవుల్లో భారత్ HARD ఎక్సర్ సైజ్

ABN, Publish Date - May 05 , 2025 | 04:13 PM

కఠిన సమయాల్లో దేశాల మధ్య ప్రాంతీయ సహకారం పట్ల భారతదేశపు నిబద్ధత మరోసారి రుజువైంది. మన ఐఎన్ఎస్ శార్దా మాల్దీవుల్లోని మాఫిలాఫుషి అటోల్‌లో తన సత్తా చాటుతోంది..

INS Sharda

HARD exercise: కఠిన సమయాల్లో దేశాల మధ్య ప్రాంతీయ సహకారం పట్ల భారతదేశపు నిబద్ధత మరోసారి రుజువైంది. ఈ క్రమంలో మాల్దీవులలో మే 04వ తేదీ నుండి 10 వరకు జరుగుతోన్న మానవతా సాయం, విపత్తు ఉపశమనం (HADR) ఎక్సర్ సైజ్ లో ఐఎన్ఎస్ శార్దా(INS Sharda) మాఫిలాఫుషి అటోల్‌లో తన సత్తా చాటుతోంది. ఇది ఇండియా, మాల్దీవుల మధ్య బలమైన రక్షణ, సముద్ర సహకారానికి నిదర్శనంగా నిలుస్తుంది.

భారతదేశపు "మహాసాగర్" (సముద్రంలో భద్రత, అభివృద్ధి కోసం పరస్పర సమగ్ర పురోగతి) దార్శనికతకు అనుగుణంగా ఈ కార్యక్రమం చేపట్టారు. హిందూ మహాసముద్ర ప్రాంతంలో శాంతి, స్థిరత్వం, శ్రేయస్సును నిర్ధారించడానికి ఇతర దేశాలతో సహకార ప్రయత్నాలను ఇది నొక్కి చెబుతుంది. ఈ హెచ్ఏడిఆర్ క్రతువు భారత నావికాదళం, ఇంకా మాల్దీవుల జాతీయ రక్షణ దళం (MNDF) మధ్య పరస్పర సామర్థ్యాన్ని పెంపొందించడం లక్ష్యంగా జరుగుతోంది.

ఇది ఇరుదేశాల మధ్య విపత్తు ప్రతిస్పందన సమన్వయం, శోధన, రెస్క్యూ ఆపరేషన్లు, వైద్య సహాయం, లాజిస్టికల్ మద్దతు, జాయింట్ డ్రిల్స్, శిక్షణా సెషన్లు ఇంకా పెద్ద ప్రకృతి వైపరీత్యం జరిగినప్పుడు ఈ కమ్యూనిటీ ఎంగేజ్‌మెంట్ వంటి చర్యలు ఎంతో సాయపడతాయి. ఇటువంటి చర్యల ద్వారా, భారతదేశం, మాల్దీవులు తమ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకుంటున్నాయి. ప్రకృతి వైపరీత్యాలు, ఇతర మానవతా సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోడానికి సంసిద్ధతను చూపిస్తున్నాయి.


ఇవి కూడా చదవండి

Pehalgam Terror Attack: ప్రధాని మోదీతో చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ భేటీ..

India Vs Pakistan: భారత్ సైనిక సమాచారం పాక్‌కు చేరవేత.. ఇద్దరి అరెస్ట్

Rahul Gandhi: సిక్కుల ఊచకోతపై రాహుల్ గాంధీ స్పందన

For National News And Telugu News

Updated Date - May 05 , 2025 | 04:14 PM