ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Donald Trump: ట్రంప్ మరో సంచలన నిర్ణయం.. ఎవ్వర్నీ వదిలేలా లేరుగా..

ABN, Publish Date - Mar 04 , 2025 | 09:00 AM

US Tariffs: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూకుడు ఏమాత్రం తగ్గడం లేదు. రెండోసారి ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి ఆయన ప్రతి విషయంలోనూ అగ్రెసివ్‌గా ముందుకెళ్తున్నారు. తాజాగా సుంకాల విషయంలోనూ పలు దేశాలకు ఆయన షాక్ ఇచ్చారు.

Donald Trump Tariffs

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వరుసగా సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. దోస్తీ గీస్తీ జాన్తా నహీ.. తమ దేశ ప్రయోజనాలే తమకు ముఖ్యమనేలా వ్యవహరిస్తున్నారు. మిత్ర దేశాల మీద సుంకాల భారం వేస్తున్న ట్రంప్.. ప్రత్యర్థులను అస్సలు వదలడం లేదు. తాజాగా చైనాకు ఆయన బిగ్ షాక్ ఇచ్చారు. ఇవాళ్టి నుంచి మెక్సికో, కెనడా దిగుమతులపై 25% సుంకాలు విధిస్తున్నామని ట్రంప్‌ స్పష్టం చేశారు. ఇప్పటికే చైనా దిగుమతులపై 10% సుంకాలు విధించిన ఆయన.. డ్రాగన్ కంట్రీపై తాజాగా మరో 10% సుంకాలు విధిస్తున్నట్లు తెలిపారు. ట్యారిఫ్స్‌తో పాటు ఉక్రెయిన్ వార్ విషయంలోనూ ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. అదేంటో ఇప్పుడు చూద్దాం..


జెలెన్‌స్కీకి గట్టి షాక్

శాంతి చర్చల కోసం వైట్‌హౌస్‌కు వచ్చి డొనాల్డ్ ట్రంప్‌తో వాగ్వాదానికి దిగిన జెలెన్‌స్కీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తమ మాట వినకపోవడం, తోక జాడించడంతో ఉక్రెయిన్‌కు యూఎస్ కోలుకోలేని షాక్ ఇచ్చింది. ఆ దేశానికి సైనిక సాయం నిలిపివేసింది అగ్రరాజ్యం. ఇటీవల వైట్‌హౌస్‌లో ట్రంప్‌-జెలెన్‌ స్కీ భేటీ రసాభాసగా మారిన సంగతి తెలిసిందే. ఖనిజాల ఒప్పందం సమయంలో ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. తాజా పరిణామాలతో ఉక్రెయిన్‌కు సైనిక సాయం నిలిపివేశారు ట్రంప్. మొత్తానికి ప్రెసిడెంట్ సీటులో కూర్చున్నప్పటి నుంచి అటు అక్రమ వలసదారులను వారి స్వదేశాలకు పంపడం, ఇటు జెలెన్‌స్కీతో వాగ్వాదం, మరోవైపు సుంకాల విధింపుతో ట్రంప్ వార్తల్లో నిలుస్తున్నారు. ఈ పరిణామాలు యూఎస్‌కు అనుకూలంగా మారతాయా? ప్రతికూలం అవుతాయా? అనేది భవిష్యత్తులో తేలుతుంది.


ఇవీ చదవండి:

‘నాటో’ కూటమి నుంచి అమెరికా వచ్చేయాలి

‘క్రిప్టో’ మార్కెట్‌కు ట్రంప్‌ జోష్‌

పుతిన్‌ గురించి టెన్షన్ వద్దు

మరిన్ని అంతర్జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Mar 04 , 2025 | 09:04 AM