Share News

Elon Musk: ‘నాటో’ కూటమి నుంచిఅమెరికా వచ్చేయాలి

ABN , Publish Date - Mar 04 , 2025 | 05:34 AM

ఐక్యరాజ్య సమితి (ఐరా స) నుంచి కూడా బయటపడాలని సూచించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మంత్రివర్గంలో ఆయన సభ్యుడు కానప్పటికీ, ప్రభుత్వ వ్యయాలను తగ్గించడానికి ఉద్దేశించిన ప్రభుత్వ సామర్థ్య విభాగా (డోగ్‌)నికి ఆధిపత్యం వహిస్తుండడం గమనార్హం.

Elon Musk: ‘నాటో’ కూటమి నుంచిఅమెరికా వచ్చేయాలి

ఐరాస నుంచీ అమెరికా బయటపడాలి యూఎస్‌ ఎయిడ్‌.. క్రిమినల్‌ సంస్థ: మస్క్‌

ఖనిజాల ఒప్పందంపై సంతకానికి సిద్ధం

అమెరికా ప్రాధాన్యం అర్థం చేసుకున్నాం!

ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ వ్యాఖ్యలు

వాషింగ్టన్‌, మార్చి 3: పరస్పర రక్షణ కోసం ఉద్దేశించిన ‘నాటో’ దేశాల కూటమి నుంచి అమెరికా బయటకు వచ్చేయాలని ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ అభిప్రాయపడ్డారు. ఐక్యరాజ్య సమితి (ఐరా స) నుంచి కూడా బయటపడాలని సూచించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మంత్రివర్గంలో ఆయన సభ్యుడు కానప్పటికీ, ప్రభుత్వ వ్యయాలను తగ్గించడానికి ఉద్దేశించిన ప్రభుత్వ సామర్థ్య విభాగా (డోగ్‌)నికి ఆధిపత్యం వహిస్తుండడం గమనార్హం. శనివారం ఎవరో ఒక వ్యక్తి ‘నాటో, ఐరాస నుంచి అమెరికా బయటకు రావాల్సిన సమయం వచ్చింది’ అంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టారు. ఇందుకు మస్క్‌ స్పందిస్తూ.. ‘నేను అంగీకరిస్తున్నా’ అని పేర్కొన్నారు. వివిధ దేశాలకు ఆర్థిక సాయం చేయడానికి ఉద్దేశించిన ‘యూఎస్‌ ఎయిడ్‌’ సంస్థను కూడా ఆయన ‘క్రిమినల్‌ ఆర్గనైజేషన్‌’గా పేర్కొనడం గమనార్హం. ప్రభుత్వ వ్యయాల తగ్గింపు పేరుతో ఆ సంస్థను రద్దు చేయించడానికి కూడా ప్రయత్నిస్తుండడం గమనార్హం. ట్రంప్‌ కూడా నాటో కూటమిపై అసంతృప్తితో ఉన్నారు. అమెరికా సెనేటర్‌ మైక్‌ లీ వంటి వారు మస్క్‌కు మద్దతు తెలిపారు.


అమెరికా వైదొలగితే ఏమవుతుంది?

పశ్చిమ దేశాల ఉమ్మడి రక్షణ కోసం 1949లో నాటో ఏర్పాటయింది. నాటో నుంచి అమెరికా బయటకు వచ్చేస్తే మిలటరీ సామర్థ్యం, నిధులపై తీవ్రమైన ప్రభావం పడుతుంది. రష్యాను అడ్డుకోవడం కష్టమవుతుంది. రెండో ప్రపంచ యుద్ధం అనంతరం ఐక్యరాజ్యసమితి ఏర్పాటయింది. దీని నుంచి కూడా అమెరికా వచ్చేస్తే అధికార సమతౌల్యత మారుతుంది. అంతర్జాతీయ విధానాల రూపకల్పనలో ఇతర దేశాల ప్రభావం పెరుగుతుంది.


ఇవి కూడా చదవండి

MK Stalin: కొత్త దంపతులు వెంటనే పిల్లల్ని కనండి

Mamata Banerjee: డూప్లికేట్‌ ఎపిక్‌ నంబర్లు ఉంటే.. నకిలీ ఓటర్లు ఉన్నట్లు కాదు!

Raksha Khadse: కేంద్ర మంత్రి రక్షా ఖడ్సే కుమార్తెకు పోకిరీల వేధింపులు

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Mar 04 , 2025 | 05:39 AM