Crypto Reserve: ‘క్రిప్టో’ మార్కెట్‌కు ట్రంప్ జోష్
ABN , Publish Date - Mar 04 , 2025 | 05:30 AM
ఎక్స్‌ఆర్‌పీ, సోలానా (ఎస్‌వోఎల్), కార్డానో (అడా) అనే మూడు క్రిప్టో కరెన్సీలతో వ్యూహాత్మక రిజర్వు ఏర్పాటు చేయాల్సిందిగా ప్రెసిడెన్షియల్ వర్కింగ్‌గ్రూ్‌పను ఆదేశించినట్టు ట్రంప్ తన సొంత సామాజిక మాధ్యమం ‘ట్రూత్ సోషల్’ పోస్టు ద్వారా తొలుత ఒక ప్రకటన చేశారు.
అమెరికా వ్యూహాత్మక రిజర్వులో చేర్చబోయే ఐదు క్రిప్టో కరెన్సీల పేర్లను వెల్లడించిన ట్రంప్
రూ.26 లక్షల కోట్ల మేర పెరిగిన మార్కెట్ విలువ
వాషింగ్టన్, మార్చి 3: క్రిప్టో కరెన్సీతో వ్యూహాత్మక రిజర్వు ఏర్పాటుకు గతంలోనే కార్యనిర్వాహక ఉత్తర్వు జారీ చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. తాజాగా ఆ రిజర్వులో ఉంచబోయే క్రిప్టో కరెన్సీల పేర్లను వెల్లడించారు. ఎక్స్‌ఆర్‌పీ, సోలానా (ఎస్‌వోఎల్), కార్డానో (అడా) అనే మూడు క్రిప్టో కరెన్సీలతో వ్యూహాత్మక రిజర్వు ఏర్పాటు చేయాల్సిందిగా ప్రెసిడెన్షియల్ వర్కింగ్‌గ్రూ్‌పను ఆదేశించినట్టు ట్రంప్ తన సొంత సామాజిక మాధ్యమం ‘ట్రూత్ సోషల్’ పోస్టు ద్వారా తొలుత ఒక ప్రకటన చేశారు. ఆ తర్వాత కొద్దిసేపటికే.. బిట్‌కాయిన్, ఎథేరియం పేర్లను కూడా ప్రస్తావిస్తూ మరో పోస్టు పెట్టారు. క్రిప్టో కరెన్సీ రిజర్వుకు ఆ రెండూ ఆయువుపట్టుగా ఉంటాయని.. తనకు బిట్‌కాయిన్, ఎథేరియం అంటే ఇష్టమని పేర్కొన్నారు. ట్రంప్ ప్రకటన క్రిప్టో మార్కెట్‌లో పెను సంచలనం సృష్టించింది. ఒక్కసారిగా క్రిప్టో కరెన్సీల విలువలు పెరిగిపోయాయి. బిట్‌కాయిన్ విలువ 10ు పెరగ్గా.. ఎథేరియం విలువ 13ు మేర పెరిగింది. 90వేల డాలర్ల వద్ద ట్రేడ్ అవుతున్న బిట్‌కాయిన్ విలువ.. ట్రంప్ ప్రకటనతో లక్ష డాలర్ల మార్కు దిశగా పరుగులు తీస్తోంది. మొత్తంగా ట్రంప్ రెండు పోస్టులతో క్రిప్టో కరెన్సీ మార్కెట్ విలువ 300 బిలియన్ డాలర్లకు పైగా (దాదాపు రూ.26 లక్షల కోట్ల మేర) పెరిగింది. ఇంతకీ ట్రంప్ ప్రకటించిన ఈ వ్యూహాత్మక క్రిప్టో రిజర్వు ఏమిటి? అంటే.. ప్రతి దేశమూ ద్రవ్యోల్బణం నుంచి తన కరెన్సీ విలువను, ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకోవడానికి బంగారాన్ని రిజర్వు చేసుకుంటుంది.
దీన్నే గోల్డ్ రిజర్వ్ అంటారు. అలాగే, చమురు ధరల్లో మార్కెట్ హెచ్చుతగ్గులు, ఒడుదొడుకుల నుంచి కాపాడుకోవడానికి చమురును రిజర్వు చేసుకోవడం కద్దు. అది ఆయిల్ రిజర్వ్. ఇలా అనూహ్య ఒత్తిళ్ల నుంచి తమ మార్కెట్లను కాపాడుకోవడానికి అన్ని దేశాలూ పలు ఉత్పత్తులతో కూడిన రిజర్వులను ఏర్పాటు చేసుకుంటాయి. ఇదే క్రమంలో అమెరికా తన కరెన్సీ విలువను కాపాడుకోవడానికి డిజిటల్ కరెన్సీతో వ్యూహాత్మక రిజర్వ్ ఏర్పాటుకు సిద్ధమైంది. ఇంతకీ ఈ బిట్‌కాయిన్ల రిజర్వును అమెరికా ప్రభుత్వం ఎలా ఏర్పాటు చేస్తుంది? బిట్‌కాయిన్ మైనింగ్ అంత సులువు కాదు కదా? అంటే.. మైనింగ్ చేయాల్సిన అవసరం లేకుండానే అగ్రరాజ్యం వద్ద పెద్ద ఎత్తున క్రిప్టో కరెన్సీ ఉన్నట్టు సమాచారం. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ దొరికిపోయినవారి నుంచి అధికారులు స్వాధీనం చేసుకున్న బిట్‌కాయిన్ల విలువే 19 బిలియన్ డాలర్ల (రూ.1.65 లక్షల కోట్ల) దాకా ఉంటుందని అంచనా. చైనా కూడా ఇదే తరహాలో పెద్ద ఎత్తున క్రిప్టో కరెన్సీ రిజర్వులను కలిగి ఉన్నట్టు చెబుతారు. అలాగే.. ఒక దేశం అధికారికంగా క్రిప్టో కరెన్సీ రిజర్వును ఏర్పాటు చేసుకోవడం ఇదే మొదలు కాదు. గతంలో ఎల్‌సాల్వడార్ క్రిప్టో కరెన్సీ రిజర్వును ఏర్పాటు చేసుకుంది.
ఇవి కూడా చదవండి
MK Stalin: కొత్త దంపతులు వెంటనే పిల్లల్ని కనండి
Mamata Banerjee: డూప్లికేట్ ఎపిక్ నంబర్లు ఉంటే.. నకిలీ ఓటర్లు ఉన్నట్లు కాదు!
Raksha Khadse: కేంద్ర మంత్రి రక్షా ఖడ్సే కుమార్తెకు పోకిరీల వేధింపులు
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.