Share News

US Politics:పుతిన్‌ గురించి ఆందోళన అక్కర్లేదు!

ABN , Publish Date - Mar 04 , 2025 | 05:28 AM

‘‘పుతిన్‌ గురించి ఎక్కువగా ఆందోళన చెందనక్కర్లేదు. దానికి సమయం తగ్గించి.. వలసదారుల అత్యాచార ముఠాలు, డ్రగ్‌ లార్డ్స్‌, హంతకులు, మానసిక వైద్యశాలల నుంచి మన దేశంలోకి వస్తున్నవారిపై దృష్టి పెట్టాలి.

US Politics:పుతిన్‌ గురించి ఆందోళన అక్కర్లేదు!

వలసదారులు, హంతకులపైనే దృష్టి పెట్టాలి: ట్రంప్‌

వాషింగ్టన్‌, మార్చి 3: రష్యా అధ్యక్షుడు పుతిన్‌ గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన, చింతించాల్సిన అవసరం లేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ వ్యాఖ్యానించారు. దానికి బదులు దేశంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ఎక్కువ సమయం కేటాయించాలన్నారు. ఆయన సొంత సోషల్‌ మీడియా వేదిక ట్రూత్‌ సోషల్‌లో ఈ మేరకు పోస్ట్‌ చేశారు. ‘‘పుతిన్‌ గురించి ఎక్కువగా ఆందోళన చెందనక్కర్లేదు. దానికి సమయం తగ్గించి.. వలసదారుల అత్యాచార ముఠాలు, డ్రగ్‌ లార్డ్స్‌, హంతకులు, మానసిక వైద్యశాలల నుంచి మన దేశంలోకి వస్తున్నవారిపై దృష్టి పెట్టాలి. ఈ అంశాలపై ఎక్కువ సమయం కేటాయించాలి. అప్పుడే మనం యూరో్‌పలా మారకుండా ఉంటాం’’ అని ట్రంప్‌ పేర్కొన్నారు. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో జరిగిన విలేకరుల సమావేశంలో తీవ్ర వాగ్వాదం జరిగిన నేపథ్యంలో ట్రంప్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.


ఇవి కూడా చదవండి

MK Stalin: కొత్త దంపతులు వెంటనే పిల్లల్ని కనండి

Mamata Banerjee: డూప్లికేట్‌ ఎపిక్‌ నంబర్లు ఉంటే.. నకిలీ ఓటర్లు ఉన్నట్లు కాదు!

Raksha Khadse: కేంద్ర మంత్రి రక్షా ఖడ్సే కుమార్తెకు పోకిరీల వేధింపులు

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Mar 04 , 2025 | 05:40 AM