ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Donald Trump: టైమ్‌ మ్యాగజైన్‌పై డొనాల్డ్ ట్రంప్ ఘాటు విమర్శలు..

ABN, Publish Date - Oct 15 , 2025 | 10:17 AM

టైమ్‌ మ్యాగజైన్‌‌లో తన గురించి ప్రచురితం అయిన కథనం సంతృప్తి పరంగా ఉందని.. కానీ కవర్‌‌పై ఉన్న ఫోటో అసలు బాగలేదని పేర్కొన్నారు. తన జుట్టును కనిపించకుండా చేశారని మండిపడ్డారు.

Donald Trump

ఇంటర్నెట్ డెస్క్: టైమ్‌ మ్యాగజైన్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి విమర్శలు గుప్పించారు. ఆయన సొంత సోషల్‌ మీడియా సోషల్‌ ట్రూత్‌లో మ్యాగజైన్‌పై రాసుకొచ్చారు. టైమ్‌ మ్యాగజైన్‌ ప్రచురితం చేసిన ఓ కథనం కవర్‌ పేజీపై తన ఫొటోలో జుట్టు సరిగా కనిపించకపోవడంతో ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రంప్‌ మీద టైమ్‌ మాగజైన్ His Triumph అనే కథన ప్రచురితం చేసింది. గాజా శాంతి ఒప్పందంలో ఆయన చేసిన కృషికిగానూ ఈ కథనం ప్రచురించింది.

టైమ్‌ మ్యాగజైన్‌‌లో తన గురించి ప్రచురితం అయిన కథనం సంతృప్తి పరంగా ఉందని.. కానీ కవర్‌‌పై ఉన్న ఫోటో అసలు బాగలేదని పేర్కొన్నారు. తన జుట్టును కనిపించకుండా చేశారని మండిపడ్డారు. జుట్టుపై ఏదో తేలియాడుతున్నట్లుగా చూపించారన్నారు. ఈ ఫోటో చూడటానికి చాలా విచిత్రంగా ఉందని తెలిపారు. తనకు ఎప్పుడూ కింది యాంగిల్‌ నుంచి తీసే ఫోటోలు నచ్చవని స్పష్టం చేశారు. తన ఫోటోల్లో ఇది చెత్త ఫోటో అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అందుకే దీన్ని ఖండిస్తున్నానని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్లు ఎందుకు చేస్తున్నారు..? ఏం చేస్తున్నారు..? అంటూ టైమ్‌ మ్యాగజైన్‌‌ మేనేజ్‌మెంట్‌పై ట్రంప్‌ మండిపడ్డారు.

అయితే.. టైమ్‌ మ్యాగజైన్‌ను ట్రంప్‌ విమర్శలు చేయడం ఇదే తొలిసారేం కాదు. ఫిబ్రవరిలో.. డోజ్‌ చీఫ్‌గా ఉన్న ఎలాన్ మస్క్ ఓవల్ ఆఫీస్‌లో రెజల్యూట్ డెస్క్ మీద కూర్చున్నట్లు ఓ ఫొటోను టైమ్‌ మ్యాగజైన్‌ ప్రచురించింది. ఆ సమయంలో ట్రంప్ ఆ ఫోటోను చూస్తూ.. అసలు టైమ్‌ మ్యాగజైన్‌ ఇంకా నడుస్తుంది అనుకోలేదు అంటూ ఎద్దేవా చేశారు.

ఇవి కూడా చదవండి:

The Supreme Court has directed: ఇందిరా టెలివిజన్‌ కేసులో కౌంటర్‌ వేయండి

Data Center : అమెరికా బయట భారీ పెట్టుబడి రామ్మోహన్‌

Updated Date - Oct 15 , 2025 | 10:36 AM