China: భారత్-పాక్ యుద్ధం మధ్యవర్తిత్వంపై చైనా సంచలన వ్యాఖ్యలు
ABN, Publish Date - Dec 31 , 2025 | 10:13 AM
భారత్ - పాక్ మధ్య జరిగిన యుద్దాన్ని తానే మధ్యవర్తిత్వం వహించి ఆపినట్లు ట్రంప్ వ్యాఖ్యలు అప్పట్లో దుమారం రేపాయి. ఇప్పుడు అదే బాటలో చైనా నడుస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: పహల్గామ్(Pahalgam) ఉగ్రదాడి(terrorist attack)కి ప్రతీకారంగా.. భారత సైన్యం ‘ఆపరేషన్ సిందూర్’ (Operation SINDOOR) పేరుతో పాక్ ఆక్రమిత ప్రాంతలపై దాడి చేసింది. ఇది భారత్-పాక్ (India-Pakistan) మధ్య కాల్పులకు దారితీసింది. ఆ పరిస్థితులు యుద్ధానికి తెరలేపాయి. ఆ సమయంలో మధ్యవర్తిత్వం ద్వారా యుద్దం జరగకుండా తామే ఆపినట్లు అమెరికా అధ్యక్షుడు(US president) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అప్పట్లో వ్యాఖ్యానించారు. దీనిపై భారత ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) స్పందించి.. కాల్పుల విరమణపై ఎవరూ మధ్యవర్తిత్వం చేయలేదని కౌంటర్ ఇచ్చారు. చైనా (China)విదేశాంగ మంత్రి వాంగ్ యి((Wang Yi).. ఇటీవల ఇదే అంశంపై కీలక ప్రకటన చేశారు. మే నెలలో భారత్ - పాక్ మధ్య యుద్ద వాతావరణం నెలకొన్న నేపథ్యంలో తామే మధ్యవర్తిత్వం వహించి ఆపామని వాంగ్ యి చెప్పుకొచ్చారు.
భారతదేశం- పాకిస్థాన్ మధ్య జరిగిన కాల్పుల ఘటన సహా అనేక ప్రపంచ సంఘర్షణలలో చైనా మధ్యవర్తిత్వం వహించి సమస్యలను పరిష్కరించిందని ఆ దేశ విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. వాంగ్ యి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. బీజింగ్‌లో అంతర్జాతీయ పరిస్థితి, చైనా విదేశీ సంబంధాలపై ఓ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా వాంగ్ యి మాట్లాడుతూ.. ‘ఇటీవల ప్రపంచంలో ఘర్షణలు, అస్థిరత బాగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలోనే శాశ్వత శాంతిని నెలకొల్పేందుకు న్యాయమైన నిర్ణయాన్ని తీసుకున్నాం. సమస్య ఎక్కడ ఉందో.. వాటి మూలలను వెతికి పరిష్కరించడపై దృష్టి పెట్టాం. ఉత్తర మయన్మార్, కంబోడియా-థాయిలాండ్, పాలస్తీనా-ఇజ్రాయెల్‌తో పాటు ఇరాన్ అణు సమస్యతో సహా ఇతర ప్రపంచ సంఘర్షణలకు బీజింగ్ శాంతి సంధాన కర్తగా నిలిచింది’ అని ఆయన అన్నారు. ప్రస్తుతం.. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇవీ చదవండి:
ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్! జపాన్‌ను వెనక్కు నెట్టి..
కొనసాగుతున్న పసిడి ధరల తగ్గుదల.. ప్రస్తుత రేట్లు ఎలా ఉన్నాయంటే..
Updated Date - Dec 31 , 2025 | 11:33 AM