ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Diseases: చైనాను వణికిస్తున్న మరో వ్యాధి.. కోవిడ్ తర్వాత ఏకంగా..

ABN, Publish Date - Jul 20 , 2025 | 09:53 AM

చైనాలోని వుహాన్‌లో మొదలైన కోవిడ్ మహమ్మారి.. ప్రపంచాన్ని ఎంతలా వణికించిందో అందరికీ తెలిసిందే. ఎంతో మంది ప్రాణాలు తీయడమే కాకుండా.. కొన్ని లక్షల మంది ఉద్యోగాలు కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పటి నుంచి ఎక్కడ ఏ వ్యాధి బయటపడినా..

చైనాలోని వుహాన్‌లో మొదలైన కోవిడ్ మహమ్మారి.. ప్రపంచాన్ని ఎంతలా వణికించిందో అందరికీ తెలిసిందే. ఎంతో మంది ప్రాణాలు తీయడమే కాకుండా.. కొన్ని లక్షల మంది ఉద్యోగాలు కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పటి నుంచి ఎక్కడ ఏ వ్యాధి బయటపడినా.. దాని మూలాలు చైనాలోనే కనిపిస్తున్నాయి. తాజాగా, చైనా వాసులను మరో ప్రాణాంతక వ్యాధి పట్టిపీడిస్తోంది. కొవిడ్ తర్వాత అంత ప్రాణాంతకమైన వ్యాధి ఇదేనట. వివరాల్లోకి వెళితే..

చైనాలో ( China) కొవిడ్ తర్వాత ప్రజలు ప్రస్తుతం చికున్ గున్యా వ్యాధితో (Chikungunya) అవస్థలు పడుతున్నారు. దీని దెబ్బకు దక్షిణ చైనా షెన్‌జెన్ పరిధి ఫోషాన్ నగరంలోని ఆసుపత్రులన్నీ రోగులతో నిండిపోయాయట. దీంతో ఎక్కువ మంది రోగులకు వసతులు కల్పించడంలో సమస్యలు తలెత్తుతున్నట్లు తెలుస్తోంది. రోజు రోజుకూ చికున్ గున్యా కేసులు పెరిగిపోతున్నాయని స్థానిక మీడియా ద్వారా సమాచారం అందుతోంది. మరోవైపు చైనా ఆరోగ్య మంత్రిత్వ శాఖాధికారులు అలెర్ట్ అయ్యారు. ఫోషాన్‌లోని షుండే, నాన్‌హై జిల్లాల్లో శనివారం ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారట. ఇళ్లు, పరిసరాల్లో వారాంతంలో పారిశుధ్య పనులు చేపట్టాని, దోమలు చేరకుండా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిస్తున్నారు.

ఏయే ప్రాంతాల్లో ఎఫెక్ట్ ఉందంటే..

షుండేలో జూలై 8న మొదటి కేసు నమోదైందని స్థానిక ఆరోగ్యాధికారులు చెబుతున్నారు. శుక్రవారం నాటిని షుండే వ్యాప్తంగా మొత్తం 1161 కేసులు నమోదైనట్లు తెలిసింది. ఈ కేసులో ఎక్కువ భాగం బీజియావో, లెకాంగ్, చెన్‌కున్ పట్టణాల్లో నమోదైనట్లు తెలుస్తోంది. అలాగే నాన్హై జిల్లాలో 16 కేసులు, చాంచెంగ్ జిల్లాలో 22 కేసులు నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు. మరోవైపు హాంకాంగ్‌లో అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. హాంకాంగ్‌లో చివరిసారిగా 2019లో చికున్ గున్యా కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఆ ఏడాది 11 కేసులు, 2018లో రెండు, 2017లో ఒకటి, 2016లో 8 కేసులు నమోదయ్యాయి.

ఇవి కూడా చదవండి:

పహల్గాం దాడి చేసిన టీఆర్‌ఎఫ్‌ను ఉగ్రసంస్థగా ప్రకటించిన అమెరికా.. స్వాగతించిన భారత్

ట్రంప్ కాళ్ల వాపుపై స్పందించిన వైట్ హౌస్.. వృద్ధుల్లో కనిపించే సాధారణ సమస్యేనని క్లారిటీ

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 20 , 2025 | 09:59 AM