Plane Crash In Turkey: ప్రైవేట్ జెట్ కూలి లిబియా సైనికాధ్యక్షుడు సహా 8 మంది మృతి
ABN, Publish Date - Dec 24 , 2025 | 07:19 AM
ఇటీవల వరుస విమాన ప్రమాదాలతో ప్రయాణికుల్లో భయాందోళన చోటు చేసుకుంటుంది. ముఖ్యంగా విమానాల్లో తలెత్తే సాంకేతిక లోపాలు, వాతావరణ పరిస్థితులు, పైలెట్ తప్పిదాల వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి.
తుర్కియే(Turkey) రాజధాని అంకారా(Ankara)లో తీవ్ర విషాదం(Tragedy) చోటు చేసుకుంది. అంకారా నుంచి లిబియా రాజధాని ట్రిపోలికి బయలుదేరిన కొద్ది క్షణాల్లోనే ‘ఫాల్కన్ 50’ ప్రైవేట్ జెట్ (Falcon 50 jet) కుప్పకూలిపోయింది (Crash). ఈ ప్రమాదం సాంకేతిక లోపం కారణంగా జరిగిందని లిబియా అధికారులు తెలిపారు. అంకారా సమీపంలోని హేమనా జిల్లాలో విమాన శకలాలు దొరికాయి. ప్రమాద సమయంలో లిబియా సైనికాధికారి, మరో నలుగురు అధికారులు, ముగ్గురు విమాన సిబ్బంది అధికారులు వెల్లడించారు. సైనికాధ్యక్షుడు మహ్మద్ అల్ -హద్దాద్ (Mohammed al-Haddad) మృతిని లిబియా ప్రధాని అబ్దుల్-హమీద్ (Abdul-Hamid) ధృవీకరించారు.
మంగళవారం రాత్రి హద్దాద్‌తో పాటు నలుగురు ఉన్నతాధికారులు ‘ఫాల్కాన్ 50’ ప్రైవేట్ జెట్‌లో అంకారా ఎయిర్ పోర్ట్ నుంచి బయలుదేరారు. గంటలోపే విమానంలో సాంకేతిక (Electrical failure)లోపం తలెత్తడంతో పైలెట్ అత్యవసర ల్యాండింగ్ (Emergency landing) కోసం ప్రయత్నించగా.. అప్పటికే సంబంధాలు తెగిపోయినట్లు అధికారులు తెలిపారు. హద్దాద్ అంకారాలో తుర్కియే రక్షణ మంత్రి, ఉన్నతాధికారులతో అధికారిక చర్చలు ముగించుకొని తిరిగి వస్తుండగా ఈ విషాదం చోటు చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
మధ్యప్రదేశ్ ఎస్ఐఆర్‌లో 42 లక్షల ఓట్ల తొలగింపు
దీపూదాస్‌ను అన్యాయంగా చంపేశారు.. ఆడియో సందేశంలో షేక్ హసీనా
Updated Date - Dec 24 , 2025 | 08:28 AM