ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

AI Minister Diella: ప్రపంచంలోనే మొట్టమొదటి ఏఐ మహిళా మంత్రి.. కారణమేంటో తెలిస్తే..

ABN, Publish Date - Sep 12 , 2025 | 01:25 PM

ఓ దేశంలో ఏకంగా ఏఐ మహిళా మంత్రినే నియమించారు. ఇలా ఏఐ మంత్రిని నియమించడం ప్రపంచంలోనే ఇది తొలిసారి. ఏ దేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.. ఎందుకు ఇలా చేశారు.. ఇంతకీ ఈ ఏఐ మంత్రి కథేంటీ.. తదితర వివరాల్లోకి వెళితే..

ప్రపంచాన్ని ఏఐ కొత్త పుంతలు తొక్కిస్తోందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఏఐ చేస్తున్న అద్భుతాలు అన్నీఇన్నీ కావు. చివరకు మనిషి అవసరం లేకుండా అన్నీ ఏఐ చేసేసినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. ఓ దేశంలో ఏకంగా ఏఐ మహిళా మంత్రినే నియమించారు. ఇలా ఏఐ మంత్రిని నియమించడం ప్రపంచంలోనే ఇది తొలిసారి. ఏ దేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.. ఎందుకు ఇలా చేశారు.. ఇంతకీ ఈ ఏఐ మంత్రి కథేంటీ.. తదితర వివరాల్లోకి వెళితే..

అల్బేనియా దేశంలో ఈ ఏఐ మంత్రిని (AI Minister Diella) నియమించారు. ఈ విషయాన్ని స్వయంగా ఆ దేశ ప్రధాని ఏడీ రమా (Albania Prime Minister Edi Rama) ప్రకటించాడు. సాంప్రదాయ దుస్తుల్లో అచ్చం మనిషిలా కనిపించే ఈ మహిళా మంత్రి పేరు డీయెల్లా. ఆ దేశ భాషలో డియోల్లా అంటే సూర్చుడు అని అర్థం వస్తుంది. ప్రస్తుతం అల్బేనియాలో అవినీతి భారీ ఎత్తున సాగుతోంది. దీన్ని అరికట్టే ఉద్దేశంతో ఆ దేశ పరిపాలనా యంత్రాంగం ఈ ఏఐ మహిళా మంత్రిని నియమించింది.

అల్బేనియా ఆన్‌లైన్ పోర్టల్ అయిన ఇ-అల్బేనియాను (E-Albania) ఈ మంత్రి పర్యవేక్షిస్తుంది. దేశంలోని సుమారు 95 శాతం ప్రభుత్వ సేవలను ఈ ఏఐ మంత్రి పర్యవేక్షిస్తారు. ప్రభుత్వ సేవలకు సంబంధించి ప్రజలకు వాయిస్ కమాండ్‌లు ఇవ్వడం దగ్గర నుంచి, దరఖాస్తులు తీసుకోవడం, సలహాలు ఇవ్వడం వంటి పనులన్నీ చేసేస్తుంది. ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత చేరువ చేయడంతో పాటూ పాలనా వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రధాని తెలిపారు.

ఈ ఏఐ మంత్రి దరఖాస్తులు, వాయిస్ కమాండ్‌లతో పాటూ అనేక కీలక బాధ్యతలను కూడా నిర్వర్తిస్తుంది. పబ్లిక్ ప్రొక్యూర్‌మెంట్‌ విధానాల్లో సమూల మార్పులు తీసుకురానుందని అల్బేనియా ప్రధాని ఏడీ రమా తెలిపారు. అవినీతికి తావు లేకుండా ప్రభుత్వ టెండర్లను నిర్వహిస్తుందని చెప్పారు. అలాగే టెండర్లను మూల్యాంకనం చేయడంలోనూ ఎలాంటి పక్షపాతం చూపదని తెలిపారు. దీంతో పాటూ పబ్లిక్ ఫండ్ కేటాయింపులు పారదర్శకతతో జరిగేలా చూస్తుందట. ‘భౌతికంగా హాజరు కాని, వాస్తవంగా AI ద్వారా సృష్టించబడిన మొదటి క్యాబినెట్ సభ్యురాలు డీయొల్లా’.. అంటూ ఎడీ రమా ప్రకటించారు. ఈయన తీసుకున్న ఈ నిర్ణయంపై ఆ దేశంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అల్బేనియన్ ప్రభుత్వం పరిపాలనా విభాగంలో ఇది కీలక మలుపు అని ఆ దేశ మీడియా అంటుండగా.. ఈ ఏఐ పాలన వల్ల చివరకు ఎదురుదెబ్బ తగలవచ్చేమో.. అంటూ మరికొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా అల్బేనియా ప్రధాని తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా ఆసక్తికర చర్చ నడుస్తోంది.

ఇవి కూడా చదవండి:

చార్లీ కిర్క్ హత్య.. వైరల్ వీడియోల్లో కీలక విషయాలు వెలుగులోకి

నేపాల్ మహిళా మంత్రి జీవితం తలకిందులు.. ప్రజాగ్రహం వెల్లువెత్తితే ఇంతే

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 12 , 2025 | 01:49 PM