పాలు తాగిన వెంటనే ఇవి తింటే గ్యాస్ సమస్య..!
ABN, Publish Date - Aug 16 , 2025 | 08:32 PM
పాలు మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో అనేక రకాల పోషకాలు ఉంటాయి. కానీ వీటిని సరిగ్గా తీసుకుంటేనే మన శరీరానికి ప్రయోజనాలు చేకూరుస్తాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. లేకపోతే, ఇవి హానికరం కావచ్చు. కాబట్టి పాలు తాగడానికి ఉత్తమ సమయం ఎప్పుడు? పాలు తాగాక తినకూడదని పదార్థాలేంటో ఈ కథనంలో చూద్దాం.
పాలు భూమిపై దొరికే ఆహారపదార్థాల్లోకెల్లా అత్యంత శ్రేష్ఠమైని. సంపూర్ణ పోషకాహారంగా పిలిచే వీటిని అమృతంతో సమానంగా భావిస్తారు. వీటిని తాగడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఇందులో అనేక రకాల పోషకాలు ఉంటాయి. పాలలో కాల్షియం, భాస్వరం ఉండటం వల్ల ఎముకలు, దంతాల దృఢంగా ఉంటాయి. ఎముకలు బలహీనంగా ఉన్నావారు రోజూ తాగితే ఇంకా మంచిది. ఇందులో ప్రోటీన్ కూడా పుష్కలంగా ఉంటుంది. దీనివల్ల మన శరీరానికి ప్రోటీన్ లభిస్తుంది. కానీ, పాల వల్ల పూర్తి ప్రయోజనాలు దక్కాలంటే మాత్రం సరైన పద్ధతిలో సేవించాల్సిందే. లేకపోతే, ఇవి హానికరం కావచ్చు. కాబట్టి పాలు తాగడానికి ఉత్తమ సమయం ఎప్పుడు? పాలు తాగాక తినకూడదని పదార్థాలేంటో ఈ కథనంలో చూద్దాం.
పాలలోని పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. వ్యాధులను దూరంగా ఉంచుతాయి. దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం చాలా ప్రయోజనకరం. పాలు తాగడం వల్ల ఏ వ్యక్తికైనా తక్షణ శక్తి లభిస్తుంది. గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. కానీ పాలు సరైన విధంగా తాగినప్పుడు మాత్రమే ఈ ప్రయోజనాలను పొందవచ్చు. లేకపోతే, అది సమస్యలను కలిగిస్తుంది. అందుకే పాలు తాగిన తర్వాత కొన్ని ఆహారాలు తినడం మంచిది కాదని నిపుణులు అంటున్నారు. అయితే అవి ఏమిటి? అది ఎందుకు మంచిది కాదని తెలుసుకోండి.
కారంగా ఉండే ఆహారం
చాలా మంది పాలు తాగిన తర్వాత చిప్స్, ఉప్పగా ఉండే బిస్కెట్లు, జంక్ ఫుడ్ తింటారు. ఈ అలవాటును వెంటనే మానేయడం మీకు మంచిది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, పాలు తాగిన వెంటనే లేదా పాలతో పాటు ఉప్పు లేదా కారంగా ఉండే ఆహారాన్ని తినకూడదు. ఇవి జీర్ణ సమస్యలను కలిగిస్తాయి.
బెల్లం పాలు
సాధారణంగా చాలా మంది బెల్లం కలిపిన పాలు ఆరోగ్యానికి మంచివని నమ్ముతారు. వాస్తవానికి, బెల్లం కలిపిన పాలు మంచివే. కానీ బెల్లం సరైన నాణ్యతతో, తాజాగా ఉండాలి. అదేవిధంగా, కొన్ని రకాల బెల్లంలో ఉప్పు శాతం ఎక్కువగా ఉంటుంది. అందుకే పాలలో బెల్లం కలపడం మంచిది కాదు. అలా చేయడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి.
సిట్రస్ పండ్లు
నారింజ, నిమ్మకాయలు వంటి సిట్రస్ పండ్లను పాలు తాగక తీసుకోవద్దు. ఈ పండ్లలో అధిక మొత్తంలో ఆమ్లం ఉంటుంది, ఇది పాలలోని ప్రోటీన్ గడ్డకట్టడానికి కారణమవుతుంది. ఇది జీర్ణ సమస్యలను కలిగిస్తుంది. ఇది గ్యాస్, ఉబ్బరం, కడుపులో నొప్పి వంటి సమస్యలకు దారితీస్తుంది. అందువల్ల, పిల్లలు, పెద్దలు పాలు తాగిన వెంటనే సిట్రస్ పండ్లను తినకూడదు. పాలు తాగిన 2 నుండి 3 గంటల తర్వాత మాత్రమే ఏ రకమైన పండ్లనైనా తినాలి.
చేప
సాధారణంగా చేపలు చాలా ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి. కానీ పాలు, చేపలను కలిపి తినకూడదు. దీనివల్ల కడుపు నొప్పి వంటి సమస్యలు వస్తాయి.
పుచ్చకాయ
పాలు తాగిన వెంటనే పుచ్చకాయ తినడం మంచిది కాదు. పాలలోని ప్రోటీన్, పుచ్చకాయలోని ఆమ్లంతో కలిసినప్పుడు అసిడిటీ వస్తుంది. దీనివల్ల కడుపు నొప్పి, అజీర్ణం, ఆరోగ్య ప్రమాదాలు పెరుగుతాయి.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)
ఇవి కూడా చదవండి:
మన పూర్వీకులు అరటి ఆకుల్లో ఎందుకు తినేవారో తెలుసా?
జుట్టుతో తయారైన టూత్ పేస్ట్.. ఇన్ని లాభాలు ఉన్నాయా?..
Updated Date - Aug 16 , 2025 | 08:48 PM