Hair Derived Toothpaste: జుట్టుతో తయారైన టూత్ పేస్ట్.. ఇన్ని లాభాలు ఉన్నాయా?..
ABN , Publish Date - Aug 16 , 2025 | 12:10 PM
Hair Derived Toothpaste: సాధారణంగా మనం కింద పడిపోయిన జుట్టును చెత్తతో పాటు ఊడ్చి చెత్త బుట్టలో పడేస్తాం. కానీ, చెత్త బుట్టలో పాడేసే ఆ జుట్టు వల్ల మన పళ్లు పుచ్చిపోకుండా ఉంటాయట. మొదటి స్టేజీలోని పుచ్చు పళ్లు.. వెంట్రుకలతో తయారైన టూత్ పేస్ట్ వాడటం వల్ల సాధారణ స్థితిలోకి వస్తాయట.
ఓ సారి ఊహించుకోండి.. మీరు మీ సొంత జట్టుతో తయారైన పేస్టుతో పళ్లు తోముకుంటే ఎలా ఉంటుంది?.. వినడానికి, ఊహించుకోవడానికి భయంకరంగా ఉంది అంటారా. మేమెందుకు జుట్టుతో తయారు చేసిన టూత పేస్ట్ వాడతాం అంటారా. అయితే, మీరు మీ పళ్ల ఆరోగ్యాన్ని దూరం చేసుకుంటున్నట్లే. ఎందుకంటే.. జుట్టుతో తయారైన పేస్టు వాడటం వల్ల పళ్లకు చాలా మేలు జరుగుతుంది. ఇది నేను చెప్పట్లేదు. సైంటిస్టులే పరిశోధనలు చేసి తేల్చిన విషయం.
లండన్ కింగ్స్ కాలేజీకి చెందిన సైంటిస్టులు చేసిన పరిశోధనల్లో అద్భుతమైన విషయాలు వెలుగు చూశాయి. జుట్టు, చర్మం, ఉన్నిలో ఉండే కెరాటిన్ అనే ప్రొటీన్ పళ్ల మీద ఉండే ఎనామిల్ పొరను పునర్నిర్మిస్తుందట. అది కూడా మన లాలాజలంతో మిక్స్ అయినపుడు మాత్రమే అద్భుతమైన ఫలితం ఉంటుందట. సాధారణంగా మనం కింద పడిపోయిన జుట్టును చెత్తతో పాటు ఊడ్చి చెత్త బుట్టలో పడేస్తాం. కానీ, చెత్త బుట్టలో పాడేసే ఆ జుట్టు వల్ల మన పళ్లు పుచ్చిపోకుండా ఉంటాయట.
పళ్లు పుచ్చి పోయినపుడు కొన్ని స్టేజీలు ఉంటాయి. మొదటి స్టేజీలోని పుచ్చు పళ్లు.. వెంట్రుకలతో తయారైన టూత్ పేస్ట్ వాడటం వల్ల సాధారణ స్థితిలోకి వస్తాయట. ఈ పేస్ట్ వల్ల మనుషులకు, పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుందని లండన్ కింగ్స్ కాలేజీ సైంటిస్టులు అంటున్నారు. అడ్వాన్స్‌డ్ హెల్త్ కేర్ మెటీరియల్‌లో ఈ పరిశోధనకు సంబంధించిన పూర్తి విషయాలు ప్రచురితమయ్యాయి. ప్రస్తుతం వెంట్రుకలతో తయారైన పేస్టుకు సంబంధించి టెస్ట్ ట్రైల్ జరుగుతున్నాయి. మరో రెండేళ్లలో పేస్ట్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి
చైనా అద్భుత సృష్టి.. ఇకపై రోబోలు కూడా పిల్లల్ని కంటాయి..
పుతిన్, ట్రంప్ మీటింగ్.. ఆకాశంలో దూసుకెళ్లిన బీ 2 బాంబర్