ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

How to Control Diabetes : ఈ పదార్థాలు తింటే.. డయాబెటిస్ తక్షణమే కంట్రోల్లోకి..

ABN, Publish Date - Feb 18 , 2025 | 03:19 PM

How to Control Diabetes : డయాబెటిస్ ఒక దీర్ఘకాలిక వ్యాధి. ఒకసారి వచ్చిందంటే అదుపు చేయడం తప్ప మరో మార్గం లేదు. ప్రస్తుతం చిన్నవయసులోనే చక్కెర వ్యాధితో బాధపడే వారి సంఖ్య పెరిగిపోతోంది. జీవితాంతం ఈ వ్యాధితో పోరాడాలంటే కచ్చితమైన డైట్ పాటించాల్సిందే. లేకపోతే మరింత ముదిరే ప్రమాదముంది. అందుకే తినే ప్రతి పదార్థం విషయంలో అనేక అపోహలు, అనుమానాలు ఉండటం సహజం. అయితే, ఈ పదార్థాలతో మధుమేహాన్ని సమర్ధవంతంగా అదుపులో చేయవచ్చు.

How to control Daibetes With Food

How to Control Diabetes : డయాబెటిస్ ఉన్నవారు అన్నీ తినలేరు. ఈ వ్యాధితో బాధపడేవారు ఏ పదార్థం తింటున్నామని తప్పక గుర్తుంచుకోవాలి. లేకపోతే రక్తంలో చక్కెర స్థాయి అమాంతం పెరిగిపోవచ్చు. ఉదయం అల్పాహారం మొదలుకుని భోజనం, రాత్రి భోజనం వరకు తినే ప్రతి పదార్థం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆహారం విషయంలో నిర్లక్ష్యం వహిస్తే మీ శరీరంలోని ఇతర భాగాలను కూడా ప్రభావితం చేస్తుంది.ఈ చర్యతో మీ శరీరం అనారోగ్యాలకు నిలయం అవుతుంది. అందుకే, డయాబెటిస్ ఉన్నవారు ఏం తినాలి.. ఏం తినవద్దు.. అని తెలుసుకోవడం చాలా ముఖ్యం. అందుకే కింద చెప్పిన ఆహారాలు, సూచనలు పాటించి మధుమేహాన్ని తగ్గించుకోండి.


స్నాక్స్ : ప్రాసెస్ చేసిన ఆహారాలు తినడం మధుమేహ వ్యాధిగ్రస్తులు కచ్చితంగా నిషేధించాలి. ఉదయం అల్పాహారం కోసం కేలరీలను పెంచని, ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతిని కలిగించే ఆహారాన్ని ఎంచుకోండి. ఉదాహరణకు మొలకెత్తిన ధాన్యాలు లేదా అవిసె గింజలు, మఖానా వంటి తక్కువ-GI, ఫైబర్ అధికంగా ఉండే స్నాక్స్‌ను ఎంచుకోవచ్చు.


గింజలు : గింజల్లో శరీరానికి అవసరమైన మోనోఅన్‌శాచురేటెడ్, పాలీఅన్‌శాచురేటెడ్ వంటి ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. అవి శక్తిని అందించడమే కాకుండా విటమిన్ శోషణలో కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. సాయంత్రం స్నాక్స్ కోసం వాల్‌నట్స్, బాదం వంటి గింజలను ఎంచుకోండి. అలాగే ఉప్పు లేని గింజలను ఎంచుకోండి. ఎందుకంటే అవి రక్తంలో చక్కెరను కూడా నియంత్రణలో ఉంచుతాయి.


ఎక్కువ టూత్‌పేస్ట్‌తో పళ్లు తోముతున్నారా.. ఇంతకు మించి వాడితే చాలా డేంజర్..


గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) : మధుమేహ వ్యాధిగ్రస్తులు పండ్లను ఎంచుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఎక్కువ పండ్లలో గ్లూకోజే ఉంటుంది. మిగిలిన వాటితో పోల్చిన ఆపిల్, జామ, బేరి, నారింజ పండ్లలో తక్కువ GI ఉంటుంది. కాబట్టి ఈ పండ్లనే ఎంచుకోండి.


పానీయాలు : ఒక కప్పు టీ లేదా కాఫీ తక్షణ శక్తిని పెంచడానికి మంచి ఛాయిస్. కానీ టీ, కాఫీలో కెఫిన్ మాత్రమే కాకుండా చక్కెర కూడా ఉంటుంది. చక్కెర లేని పానీయాలు తాగద్దు కాబట్టి ఇన్ఫ్యూజ్డ్ వాటర్, వేడి సూప్‌లు, కొబ్బరి నీళ్లు లేదా స్మూతీలు వంటి ప్రత్యామ్నాయాలను ప్రయత్నించండి. ఇవి మిమ్మల్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతాయి. రక్తంలో చక్కెర స్థాయి పెరగకుండా చూస్తాయి.


ఇవి కూడా చదవండి..

Mouth Wash Solution : ఇంట్లోనే మౌత్ వాష్ తయారు చేయడం వచ్చా.. చాలా సింపుల్..

Health Tips : ఈ 5 రకాల పదార్థాలు.. అన్నంతో కలిపి తింటే డయాబెటిస్..

weight gain Reasons: ఈ 6 అలవాట్లు మీ బరువు పెరగడానికి ప్రధాన కారణం.

మరిన్ని ఆరోగ్య, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Feb 18 , 2025 | 03:22 PM