Healthy Breakfast Ideas: ఉదయం నిద్రలేవగానే ఆకలిగా అనిపిస్తోందా.. బెస్ట్ ఫుడ్ ఐడియాస్ మీకోసం..
ABN, Publish Date - May 03 , 2025 | 07:34 AM
Nutritious Morning Foods: ఉదయం నిద్రలేచిన వెంటనే ఆకలిగా అనిపిస్తోందా.. ఏం తినాలో అర్థం కావడం లేదా.. అయితే ఈ 5 ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోండి. జీర్ణక్రియ మెరుగుపడటంతో పాటు రోజంతా ఎనర్జిటిక్‌గా ఉంటారు.
Best Foods For Energy In The Morning: చాలా మందికి ఉదయం నిద్ర లేచిన వెంటనే ఆకలిగా అనిపిస్తుంది. రాత్రిపూట కడుపు నిండా భోజనం చేసినప్పటికీ ఉదయం మేల్కొన్న క్షణం నుంచి ఏదైనా తినాలనే కోరిక పుడుతుంది. కొంతమంది ఆకలేస్తున్నా ఎప్పటికో తింటుంటారు. ఇది చాలా తప్పు. అలాగని హడావుడిగా ఏదొకటి తినేయడమూ కరెక్ట్ కాదు. ఉదయపు ఆకలిని తీర్చుకోవడానికి తప్పుడు ఆహారాలను ఎంచుకుంటే శరీరానికి సరైన పోషకాలు అందవు. ఇది వారి ఫిట్‌నెస్‌ను ప్రభావితం చేస్తుంది. నిజానికి, మనం రోజులో తీసుకునే మొదటి ఆహారమే మన ఆరోగ్యాన్ని నిర్దేశిస్తుంది. కాబట్టి, ఉదయపు ఆకలిని తీర్చుకోవడానికి తినాల్సిన 5 ఆరోగ్యకరమైన అల్పాహారాలు ఏంటో చూద్దాం..
1) డ్రై ఫ్రూట్స్
పోషకాలు సమృద్ధిగా ఉండే డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే చాలా మంచిది. ఇందులో వివిధ విటమిన్లు, ఖనిజాలతో పాటు కేలరీలు, కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఉదయాన్నేఒక గుప్పెడు డ్రై ఫ్రూట్స్ తింటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఆ రోజుకు కావాల్సిన పోషకాలు శరీరానికి అందుతాయి.
2) అరటిపండు
అరటిపండును ఖాళీ కడుపుతో తినవచ్చు. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది పేగు కదలికలను పెంచి జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. మీ ఉదయపు ఆకలిని తీర్చుకోవడానికి తేలికైన, పోషకాలున్న ఆహారం తినాలని కోరుకుంటే అరటిపండు బెస్ట్ ఛాయిస్. ఈ పండు శరీరంలో శక్తి స్థాయిలను పెంచడంలో సహాయపడుతుంది. చాలాసేపు కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. అయితే, గ్యాస్, ఎసిడిటీ ఉన్నవారు తినకపోవడమే మేలు.
3) కొబ్బరి నీళ్లు
ఉదయం ఖాళీ కడుపుతో కొబ్బరి నీళ్లు తాగితే ఎలక్ట్రోలైట్స్ శరీరానికి అంది తాజా అనుభూతి కలుగుతుంది. ఇది కేవలం రిఫ్రెషింగ్ డ్రింక్ మాత్రమే కాదు. రాత్రంతా డీహైడ్రేట్ అయిన శరీరానికి కావాల్సిన అన్ని పోషకాలను తక్షణమే అందిస్తుంది.
4) ఓట్ మీల్
ఉదయం మేల్కొగానే అల్పాహారంగా ఒక గిన్నె ఓట్ మీల్ తింటే ఆరోగ్యానికి చాలామంచిది. ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది కాబట్టి ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలిగిస్తుంది. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు నియంత్రించడంలో సహాయపడుతుంది. మరింత రుచిగా మీ అల్పాహారం ఉండాలని కోరుకుంటే ఓట్ మీల్‌కు తాజా పండ్లు లేదా ఎండిన పండ్లను జోడించవచ్చు.
5) గుడ్లు
గుడ్లలో అన్ని రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిలో అధిక నాణ్యత గల ప్రోటీన్, ముఖ్యమైన అమైనో ఆమ్లాలు ఉంటాయి. ఇవి కండరాల ఆరోగ్యాన్ని పెంచడంలో సహాయపడతాయి. మీ ఉదయం ఆకలిని తీర్చుకోవడానికి ఇది బెస్ట్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్.
Read Also: Anger Issues: మీకు కోపం ఎక్కువగా వస్తుందా.. తీవ్రమైన నష్టాలు ఎదుర్కొంటారు..
Mental Health Problem: మీ మనసు ఎప్పుడూ విచారంగా ఉంటుందా.. కారణాలు తెలుసుకోండి..
Diabetes: వేసవిలో షుగర్ పేషెంట్లు గ్లూకోజ్ పౌడర్ వాడవచ్చా..
Updated Date - May 03 , 2025 | 07:35 AM