ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

RRB Recruitment 2025 : RRBలో ఈ పోస్టులకు దరఖాస్తు చేశారా.. ఈ రోజే లాస్ట్ డేట్..

ABN, Publish Date - Mar 03 , 2025 | 01:18 PM

RRB Group D Recruitment 2025 : రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) గ్రూప్-డి ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు రుసుము సమర్పించడానికి ఈరోజు మార్చి 3, 2025 చివరి తేదీ. రేపటి నుండి సవరణ ప్రారంభమవుతుంది. ఈ పోస్టులకు మీలో ఎవరైనా అప్లై చేసుకోకపోతే వెంటనే చేయండి. నేరుగా దరఖాస్తు చేసుకునేందుకు..

RRB Group D 2025 Apply Online

RRB Group D Recruitment 2025 : రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) గ్రూప్-డి రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు రుసుము సమర్పించడానికి ఈరోజు మార్చి 3, 2025 చివరి తేదీ. అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోకపోయుంటే గడువు ముగియకముందే త్వరపడండి. కొన్ని గంటల సమయమే ఉంది. RRBల ప్రాంతీయ వెబ్‌సైట్‌లను సందర్శించి దరఖాస్తు సమర్పించండి. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, మార్చి 4వ తేదీ నుంచి సవరణ ప్రక్రియ మొదలవబోతోంది.


ఈ నియామక ప్రక్రియ ద్వారా, RRB 7వ CPC పే మ్యాట్రిక్స్ లెవల్ 1 పోస్టులలో 32,438 ఖాళీలను భర్తీ చేస్తుంది. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ జనవరి 22, 2025న ప్రారంభమైంది. వాస్తవానికి మార్చి 1, 2025 చివరి తేదీ అయినప్పటికీ మరో రెండు రోజులు గడువు పెంచింది. దరఖాస్తు ఫారమ్‌ను సరిదిద్దడానికి మార్చి 4 నుంచి మార్చి 13, 2025 వరకు సమయం ఇస్తారు. 'క్రియేట్ అకౌంట్'లో నమోదు చేసిన వివరాలను, ఎంచుకున్న రైల్వే వివరాలను అభ్యర్థులు మార్చలేరని రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు స్పష్టం చేసింది. RRB గ్రూప్ D 2025 అడ్మిట్ కార్డ్ పరీక్షకు వారం ముందు విడుదల చేస్తారు.


దరఖాస్తు రుసుము:

  • జనరల్, OBC, SC, ST, ట్రాన్స్‌జెండర్, మహిళా అభ్యర్థులకు దరఖాస్తు రుసుము రూ. 250. జనరల్ కేటగిరీ పురుష అభ్యర్థులకు దరఖాస్తు రుసుము రూ. 500. PwD, SC, ST పురుష అభ్యర్థులకు దరఖాస్తు రుసుము రూ. 250.

  • RRB గ్రూప్ D 2025 రిజిస్ట్రేషన్ ఫీజును నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, UPI మరియు ఆఫ్‌లైన్ చలాన్ ద్వారా చెల్లించవచ్చు.

  • రూ.500రుసుము చెల్లించినవారికి CBT కి హాజరు అయ్యాక బ్యాంక్ ఛార్జీలను మినహాయించి రూ. 400 మొత్తాన్ని సకాలంలో తిరిగి చెల్లిస్తారు. ఫీజు రూ.250లు కట్టినవారికి ఇదే నిబంధన వర్తిస్తుంది.


RRB గ్రూప్ D ఎంపిక ప్రక్రియ:

కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT), ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ (PET) ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. CBT 90 నిమిషాలు ఉంటుంది. దీనిలో మొత్తం 100 ప్రశ్నలు అడుగుతారు. CBTలో ప్రతి తప్పు సమాధానానికి మూడో వంతు మార్కులు తగ్గిస్తారు.

  • జనరల్ సైన్స్, మ్యాథమెటిక్స్ నుండి 25 ప్రశ్నలు,

  • జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ నుండి 30 ప్రశ్నలు,

  • జనరల్ అవేర్‌నెస్, కరెంట్ అఫైర్స్ నుండి 20 ప్రశ్నలు ఉంటాయి.


మార్కుల సాధారణీకరణ ప్రక్రియ CBTలో వర్తిస్తుంది. CBTలో బాగా రాణించిన అభ్యర్థులను శారీరక సామర్థ్య పరీక్షకు పిలుస్తారు. CBT ఆధారంగా మొత్తం ఖాళీల సంఖ్యకు మూడు రెట్లు PETలో పాల్గొనే అవకాశం లభిస్తుంది. CBT ఒక దశలో మాత్రమే నిర్వహించబడుతుంది. PET తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, వైద్య పరీక్ష ఉంటుంది.

అధికారిక నోటీసు చదవడానికి అభ్యర్థులు ఈ లింక్‌పై క్లిక్ చేయవచ్చు . మరిన్ని వివరాల కోసం, అభ్యర్థులు RRB అధికారిక వెబ్‌సైట్‌లను సందర్శించండి.

నోటిఫికేషన్ PDF కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..


Read Also : India Post GDS 2025 : GDSలో 21వేల పోస్టులు..ఈ రోజే చివరి తేదీ.. డైరక్ట్ లింక్ కోసం..

Job News: టెన్త్ పాసయ్యారా...CISFలో 1124 జాబ్స్‌..ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి!

IDBI Jobs: నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్.. 650 పోస్టులకు జాబ్‌ నోటిఫికేషన్..

Updated Date - Mar 03 , 2025 | 01:23 PM