Share News

India Post GDS 2025 : GDSలో 21వేల పోస్టులు..ఈ రోజే చివరి తేదీ.. డైరక్ట్ లింక్ కోసం..

ABN , Publish Date - Mar 03 , 2025 | 12:40 PM

India Post GDS 2025 : ఇండియా పోస్ట్ గ్రామీణ్ డాక్ సేవక్ (GDS) 21413 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు చేసుకోనివారు వెంటనే చేసుకోండి. ఎందుకంటే, ఈరోజు మార్చి 3, 2025 చివరి తేదీ. మరింత సమాచారం కోసం..

India Post GDS 2025 : GDSలో 21వేల పోస్టులు..ఈ రోజే చివరి తేదీ.. డైరక్ట్ లింక్ కోసం..
India Post GDS Registration 2025 Direct Link to Apply for 21,000 Posts

India Post GDS 2025 Last Chance to Apply Online : ఇండియా పోస్ట్ గ్రామీణ్ డాక్ సేవక్ (GDS) రిక్రూట్‌మెంట్ 2025 కోసం దరఖాస్తు ప్రక్రియ ఈరోజుతో ముగియనుంది. మార్చి 3, 2025 చివరి తేదీ. ఈ నియామక ప్రక్రియ కింద మొత్తం 21,413 పోస్టులకు అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మీరు ఇంకా దరఖాస్తు చేసుకోకపోతే కింద ఇచ్చిన అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయండి.


ఇండియా పోస్ట్ గ్రామీణ్ డాక్ సేవక్ (GDS) రిక్రూట్‌మెంట్ 2025 కోసం ఇంకా దరఖాస్తు ప్రక్రియ 10 ఫిబ్రవరి 2025 నుండి ప్రారంభమైంది. ఈ రోజు మార్చి 3, 2025 చివరి తేదీ. చేసుకోని అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ indiapostgdsonline.gov.in ని సందర్శించి త్వరగా దరఖాస్తు చేసుకోండి. ఈ నియామకాల ద్వారా 21,413 పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తు ఫారంలో ఏదైనా తప్పులు ఉంటే అభ్యర్థులు మార్చి 6, 2025న నుంచి మార్చి 8, 2025 మధ్యన సరిదిద్దుకునేందుకు అవకాశం కల్పిస్తారు.


విద్యార్హత : అభ్యర్థి గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. దీనితో పాటు అభ్యర్థికి తాను దరఖాస్తు చేసుకుంటున్న రాష్ట్రం యొక్క స్థానిక భాష తప్పక మాట్లాడటం వచ్చి ఉండాలి. అభ్యర్థి ఈ భాషను 10వ తరగతి వరకు అభ్యసించి ఉండాలి.

వయోపరిమితి : కనీస వయస్సు - 18 సంవత్సరాలు. గరిష్ఠ వయస్సు - 40 సంవత్సరాలు (మార్చి 3, 2025 నాటికి). ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్‌డ్ కేటగిరీల అభ్యర్థులకు వయో సడలింపు ఇవ్వబడుతుంది.


జీతం : బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (BPM) నెలవారీ జీతం రూ. 12,000- రూ. 29,380.

అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (ABPM)/డాక్ సేవక్ నెలవారీ జీతం రూ. 10,000 - రూ. 24,470.

ఎంపిక ప్రక్రియ : భారతీయ తపాలా శాఖ ఈ పోస్టుల నియామకానికి రాత పరీక్ష నిర్వహించదు. అభ్యర్థులను వారి 10వ తరగతి మార్కుల ఆధారంగా మాత్రమే మెరిట్ జాబితా నుంచి ఎంపిక చేస్తారు.


దరఖాస్తు రుసుము : జనరల్, OBC (ఇతర వెనుకబడిన తరగతులు) అభ్యర్థులకు దరఖాస్తు రుసుము రూ. 100. SC (షెడ్యూల్డ్ కులం), ST (షెడ్యూల్డ్ తెగ), PWD (వికలాంగుడు), మహిళా అభ్యర్థులకు ఎటువంటి దరఖాస్తు రుసుము లేదు.


Read Also : Job News: టెన్త్ పాసయ్యారా...CISFలో 1124 జాబ్స్‌..ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి!

IDBI Jobs: నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్.. 650 పోస్టులకు జాబ్‌ నోటిఫికేషన్..

CBSE: ఈ విద్యార్థులకు షాకింగ్ న్యూస్.. సీబీఎస్ఈ కీలక నిర్ణయం..

Updated Date - Mar 03 , 2025 | 12:44 PM