Share News

Job News: టెన్త్ పాసయ్యారా...CISFలో 1124 జాబ్స్‌..ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి!

ABN , Publish Date - Mar 03 , 2025 | 11:55 AM

Job News: టెన్త్ పాసైన నిరుద్యోగులకు గుడ్ న్యూస్. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) లో పదో తరగతి అర్హతతో జాబ్ నోటిఫికేషన్ వచ్చింది. ఆసక్తి ఉన్నవారు గడువు పూర్తి కాకముందే వెంటనే అప్లై చేసుకోండి.

Job News: టెన్త్ పాసయ్యారా...CISFలో 1124 జాబ్స్‌..ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి!
CISF Constable Driver Recruitment 2025

CISF Constable Driver Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్. మీరు టెన్త్ పాస్ అయ్యారా. ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం వేచిచూస్తున్నారా.. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) లో కానిస్టేబుల్/డ్రైవర్, కానిస్టేబుల్/డ్రైవర్-కమ్-పంప్ ఆపరేటర్ పోస్టుల కోసం రిక్రూట్‌మెంట్ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఆసక్తి ఉన్న అభ్యర్థులకు ఇప్పుడు చివరి అవకాశం. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ మార్చి 4, 2025 (రాత్రి 11:59 గంటలలోపు). కనుక ఇంకా అప్లై చేయని అభ్యర్థులు త్వరగా అప్లికేషన్ సమర్పించండి.


ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 1124 ఖాళీలు భర్తీ చేయనున్నారు. ఇందులో 845 కానిస్టేబుల్/డ్రైవర్ పోస్టులు కాగా, 279 కానిస్టేబుల్/డ్రైవర్-కమ్-పంప్ ఆపరేటర్ పోస్టులు ఉన్నాయి. జనరల్, OBC, EWS, SC, ST కేటగిరీలకు రిజర్వేషన్ ఉన్నందున అభ్యర్థులు తమ కేటగిరీ ఆధారంగా దరఖాస్తు చేసుకోవచ్చు.


ఇతర ముఖ్యమైన వివరాలు:

CISF కానిస్టేబుల్/డ్రైవర్ పోస్టులకు దరఖాస్తు చేయాలంటే అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే, అభ్యర్థులకు చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. లైట్ మోటార్ వెహికల్ (LMV), హెవీ మోటార్ వెహికల్ (HMV) లైసెన్స్ కలిగి ఉండటమే కాకుండా, గేర్ వాహనాలను నడపగల సామర్థ్యం కూడా ఉండాలి.


వయోపరిమితి: అభ్యర్థుల వయస్సు 21 నుండి 27 ఏళ్ల మధ్య ఉండాలి. అయితే, SC, ST, OBC అభ్యర్థులకు వయస్సులో కొన్ని సడలింపులు ఉంటాయి.

ఫీజు వివరాలు: ఈ ఉద్యోగాలకు జనరల్, EWS, OBC అభ్యర్థులు రూ. 100 అప్లికేషన్ ఫీజుగా చెల్లించాలి. అయితే, SC, ST, మాజీ సైనికులకు ఫీజు మినహాయింపు ఉంటుంది. అభ్యర్థులు ఆన్‌లైన్ లేదా SBI చలాన్ ద్వారా ఫీజు చెల్లించవచ్చు.

జీతం: ఎంపికైన అభ్యర్థులకు పే స్కేల్ రూ. 21,700 - 69,100 లభిస్తుంది. అంతేకాకుండా, ప్రభుత్వ ఉద్యోగిగా పలు ఇతర అలవెన్సులు కూడా లభిస్తాయి.


ఇలా అప్లై చేయండి:

దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు ముందుగా CISF అధికారిక వెబ్‌సైట్ (cisfrectt.cisf.gov.in) కి వెళ్లాలి. హోమ్‌పేజీలో "CISF కానిస్టేబుల్ డ్రైవర్ రిక్రూట్‌మెంట్” లింక్‌పై క్లిక్ చేయాలి. అక్కడ మీ వివరాలను నమోదు చేసి, అవసరమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి. చివరగా, అప్లికేషన్ ఫీజు చెల్లించి, దరఖాస్తును సమర్పించాలి. భవిష్యత్తులో ఉపయోగం కోసం దరఖాస్తు ఫారమ్ ప్రింట్ తీసుకోవడం మంచిది.


CISF‌లో ఉద్యోగం పొందాలనుకునే అభ్యర్థులకు ఇది ఉత్తమ అవకాశంగా చెప్పొచ్చు. ఈ పోస్టులు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కావడంతో భద్రతతో పాటు మంచి వేతనం కూడా లభిస్తుంది. కనుక, ఆసక్తి గల అభ్యర్థులు మార్చి 4, 2025లోపు తప్పనిసరిగా తమ దరఖాస్తులను సమర్పించాలి. మరింత సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.


Read Also : Teenager Kills His Cousin : 5 ఏళ్ల చిన్నారిని హత్య చేసిన.. 13 ఏళ్ల కుర్రాడు.. దేనికోసమో తెలిస్తే..

Business Ideas : పీఎం మోదీ చెప్పిన ఈ పంటకు పెట్టుబడి రూ.20వేలు.. రాబడి రూ.3-4లక్షలు..

Nara Lokesh: మెగా డీఎస్సీపై అసెంబ్లీలో మంత్రి లోకేష్ ఏం చెప్పారంటే..

Updated Date - Mar 03 , 2025 | 12:05 PM