Share News

Nara Lokesh: మెగా డీఎస్సీపై అసెంబ్లీలో మంత్రి లోకేష్ ఏం చెప్పారంటే..

ABN , Publish Date - Mar 03 , 2025 | 10:20 AM

Minister Nara Lokesh: నాడు నేడుపై రిపోర్టు తీసుకుని యాక్షన్ తీసుకుంటామని మంత్రి నారా లోకేష్ అన్నారు. నాడు నేడుపై ఆరోపణలు వచ్చాయి ఇందులో నాణ్యత లేదన్నారని చెప్పారు.

Nara Lokesh: మెగా డీఎస్సీపై అసెంబ్లీలో మంత్రి లోకేష్ ఏం చెప్పారంటే..
Minister Nara Lokesh

అమరావతి: ఏపీ అసెంబ్లీలో బడ్జెట్‌ పద్దులపై ఇవాళ(సోమవారం) చర్చ ప్రారంభమైంది. వివిధ కేటాయింపులు, సంక్షేమానికి నిధుల అంశాలపై చర్చిస్తున్నారు.ఇవాళ సభ ముందుకు మున్సిపల్ చట్ట సవరణ ఆర్డినెన్స్‌ తీసుకురానుంది. సభలో మంత్రి నారాయణ ప్రవేశపెట్టనున్నారు. ఏపీ ఫిల్మ్ అండ్ టెలివిజన్‌పై వార్షిక నివేదికను సభలో మంత్రి కందుల దుర్గేష్ ప్రవేశపెట్టనున్నారు. పరిశ్రమలు, ఇంధన శాఖల వార్షిక నివేదికలను సభలో ముందు మంత్రులు టీజీ భరత్, గొట్టిపాటి రవికుమార్ ఉంచనున్నారు. ఈ సందర్భంగా ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి నారాలోకేష్‌ బడ్జెట్‌ పద్దులపై చర్చించారు. మెగా డీఎస్సీతో 16,347 టీచర్‌ పోస్టుల భర్తీకి త్వరలో ప్రకటిస్తామని అన్నారు.


ఏపీ వ్యాప్తంగా స్కూళ్ల ప్రహరీ గోడను పూర్తిచేయాలంటే రూ.3వేల కోట్లు అవుతుందని తెలిపారు. మనబడి మనభవిష్యత్తు, ఉపాధి హమీ కింద దశలవారీ చేపడుతామని అన్నారు. డ్రగ్స్ వద్దు బ్రో అనే క్యాంపెయిన్ ఈ ప్రభుత్వం చేపట్టిందని గుర్తుచేశారు. ప్రతి పాఠశాలలో ఈగల్ టీంలు ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. అన్ని కాలేజీలకు, పాఠశాలల్లో వీటిని ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. పేరెంట్ టీచర్ మీటింగ్‌లో స్టార్ రేటింగ్ ఆధారంగా మౌలిక సదుపాయాలు, మంచి విద్య అందించడంలో ప్రణాళికలు వేస్తున్నామని తెలిపారు.


117 జీవోతో నిరుపేదలకు విద్యను దూరం చేశారని మండిపడ్డారు. గత జగన్ ప్రభుత్వ నిర్వాకంతో 12 లక్షల మంది విద్యార్ధులు తగ్గిపోయారని చెప్పారు. దీనికి ఓ ప్రత్యమ్నాయంపై సభ్యులతో చర్చించాలని నిర్ణయించామన్నారు. మధ్యాహ్నం ఓ సమావేశం ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. ఇన్ కంప్లీట్‌గా ఉన్న పనులన్ని పూర్తిచేస్తామని చెప్పారు.117 జీవోకు ప్రత్యమ్నాయంగా తీసుకువచ్చే జీవో ఆధారంగా సభ్యుల సలహలతో ముందుకు వెళ్తామని అన్నారు. నాడు నేడుపై ఆరోపణలు వచ్చాయి ఇందులో నాణ్యత లేదన్నారని చెప్పారు. నాడు నేడుపై రిపోర్టు తీసుకుని యాక్షన్ తీసుకుంటామని అన్నారు. రంపచోడవరం నియోజకవర్గంలో 80 పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు అమలు చేస్తున్నామని తెలిపారు.


సీసీ టీవీలు, లైటింగ్ పాఠశాలల వద్ద ఏర్పాటు చేస్తామన్నారు. లెర్నింగ్ ఎక్స్ లెన్స్ ఆఫ్ ఏపీ కింద సీఎస్ఆర్ నిధులు తెచ్చి అభివృద్ధి చేయాలని అన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎలా అయితే సీఎస్ఆర్ ద్వారా అభివృద్ధి చేస్తున్నారో అలా మనం కూడా చేద్దామని చెప్పారు. ప్రశ్నోత్తరాల సమయంలో నాల్గో ప్రశ్నను వైసీపీ సభ్యులు అడిగారు. వారికి సమాధానం ఇస్తానని డిప్యూటీ స్పీకర్‌ను మంత్రి లోకేష్‌ అభ్యర్థించారు. టీవీలో అయినా సభ్యులు సమాధానం చూసుకుంటారని డిప్యూటీ స్పీకర్ తెలిపారు. టీవీలో చూడటం కాదు టీవీలు బద్దలు అవుతాయని మంత్రి నారా లోకేష్ విమర్శించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఈసారి భగభగలే

నాలుగు నిమిషాల్లో ఏటీఎంలో చోరీ

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Mar 03 , 2025 | 11:08 AM