ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

JNTU: జేఎన్‌టీయూలో డిప్యూటీ డైరెక్టర్‌ పోస్టులకు చెల్లుచీటి

ABN, Publish Date - Jun 24 , 2025 | 11:19 AM

జేఎన్‌టీయూ(JNTU)లో డిప్యూటీ డైరెక్టర్‌ పదవులను రద్దు చేస్తూ వర్సిటీ ఉపకులపతి కిషన్‌కుమార్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. మూడేళ్ల కిందట వర్సిటీలోని పలు విభాగాలకు అప్పటి వీసీ కట్టా నర్సింహారెడ్డి డిప్యూటీ డైరెక్టర్‌ పోస్టులను సృష్టించగా, ఆ నిర్ణయాలకు ప్రస్తుత వీసీ తాజాగా మంగళం పాడారు.

- కొన్ని విభాగాల్లో డీడీ పోస్టులకు బదులు కోఆర్డినేటర్లు

- మాజీ వీసీ నిర్ణయాలకు కొత్త వీసీ తిలోదకాలు

- పలువురు ప్రొఫెసర్లకు పోస్టింగులు, బదిలీలు

హైదరాబాద్‌ సిటీ: జేఎన్‌టీయూ(JNTU)లో డిప్యూటీ డైరెక్టర్‌ పదవులను రద్దు చేస్తూ వర్సిటీ ఉపకులపతి కిషన్‌కుమార్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. మూడేళ్ల కిందట వర్సిటీలోని పలు విభాగాలకు అప్పటి వీసీ కట్టా నర్సింహారెడ్డి డిప్యూటీ డైరెక్టర్‌ పోస్టులను సృష్టించగా, ఆ నిర్ణయాలకు ప్రస్తుత వీసీ తాజాగా మంగళం పాడారు. కొన్ని విభాగాల్లో డిప్యూటీ డైరెక్టర్‌ హోదా పోస్టులను కోఆర్డినేటర్‌ స్థాయికి తెచ్చారు.

రెండు విభాగాల్లో కోఆర్డినేటర్లుగా కొందరు ప్రొఫెసర్లకు పోస్టింగులు ఇవ్వడంతో, మరికొన్ని విభాగాల్లో పనిచేస్తున్న అధికారులను స్థానచలనం కల్పిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. రీసెర్చ్‌ అండ్‌ డెవల్‌పమెంట్‌ విభాగంలో డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్న డాక్టర్‌ ఎ.ఉమను అదే విభాగంలో సమన్వయకర్తగా నియమించారు.

దూరవిద్య విభాగంలో డిప్యూటీ డైరెక్టర్‌గా ఉన్న ప్రొఫెసర్‌ ధనలక్ష్మిని అకడమిక్‌ అఫైర్స్‌ విభాగంలో సమన్వయకర్తగా, ఎలక్ట్రికల్‌ విభాగాధిపతి భాస్కర్‌ను పరీక్షల విభాగం కంట్రోలర్‌గా బదిలీ చేశారు. ప్రొఫెసర్‌ కేహెచ్‌ ఫణిశ్రీని ఎలక్ట్రికల్‌ విభాగం హెచ్‌ఓడీగా నియమించారు. కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌గా ఉన్న ప్రొఫెసర్‌ నాగరత్నను కంప్యూటర్‌ సైన్స్‌ విభాగానికి బదిలీ చేశారు.

ఈ వార్తలు కూడా చదవండి.

గప్పా గప్పా గుద్ది.. రప్పా రప్పా జైల్లో వేయాలి

బండి సంజయ్‌ది అసత్య ప్రచారం

Read Latest Telangana News and National News

Updated Date - Jun 24 , 2025 | 11:19 AM