ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

JNTU: మూల్యాంకనం ముగిసినా.. టీజీ పీజీఈసెట్‌ ఫలితాల విడుదలలో ఆలస్యం

ABN, Publish Date - Jun 24 , 2025 | 08:36 AM

పోస్టు గ్రాడ్యుయేటెడ్‌ ఇంజనీరింగ్‌ , ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల నిమిత్తం నిర్వహించిన పీజీఈసెట్‌-2025 ఫలితాలు మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

హైదరాబాద్‌ సిటీ: పోస్టు గ్రాడ్యుయేటెడ్‌ ఇంజనీరింగ్‌ , ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల నిమిత్తం నిర్వహించిన పీజీఈసెట్‌-2025 ఫలితాలు మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. నిర్వహణ బాధ్యతలు చేపట్టిన జేఎన్‌టీయూ(JNTU) అధికారులు ఇప్పటికే మూల్యాంకన ప్రక్రియ పూర్తిచేయగా, ఫలితాల విడుదలకు ఇంకా ముహూర్తం ఖరారు చేయలేదని తెలిసింది. ఈ నెల 16, 17 తేదీల్లో జరిగిన పీజీఈసెట్‌ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 20వేలమంది అభ్యర్థులు హాజరయ్యారు.

ఓ వైపు 2.50 లక్షలమంది అభ్యర్థులు రాసిన ఎప్‌సెట్‌ పరీక్షా ఫలితాలను జేఎన్‌టీయూ అధికారులు వారం రోజుల్లోపే విడుదల చేయగా, కేవలం 20వేల మంది రాసిన పీజీఈసెట్‌ పరీక్షా ఫలితాలు వారం గడిచినా విడుదల కాకపోవడం పట్ల అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై ఉన్నత విద్యామండలి ఉన్నతాధికారి ఒకరు స్పందిస్తూ,

ప్రస్తుతం తామంతా ఎప్‌సెట్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియను ఖరారు చేసే పనిలో బిజీగా ఉన్నామని, పీజీఈసెట్‌ ఫలితాలను వీలైనంత త్వరగా ప్రకటించేలా చర్యలు చేపడతామన్నారు. వాస్తవానికి పీజీఈసెట్‌ పరీక్షా ఫలితాలను చివరి పరీక్ష ముగిసిన 4రోజుల్లో ప్రకటిస్తారని ఆశించిన అభ్యర్థులకు, అధికారుల తాత్సారం వలన నిరాశ తప్పడం లేదు.

ఈ వార్తలు కూడా చదవండి.

గప్పా గప్పా గుద్ది.. రప్పా రప్పా జైల్లో వేయాలి

బండి సంజయ్‌ది అసత్య ప్రచారం

Read Latest Telangana News and National News

Updated Date - Jun 24 , 2025 | 08:45 AM