ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

JNTU: జేఎన్‌టీయూ.. ఇదేం తీరు!

ABN, Publish Date - Dec 19 , 2025 | 08:35 AM

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాలను జేఎన్‌టీయూ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువలా వస్తున్నాయి. ఫీజు బకాయిల గురించి విద్యార్థుల సర్టిఫికెట్లు ఆపొద్దు’’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇటీవల ఓ బహిరంగ సభలో ప్రైవేటు కళాశాలలను హెచ్చరించారు. అయినప్పటికీ ప్రభుత్వ కళాశాలైన జేఎన్‌టీయూ అధికారులే ఖాతరు చేయడం లేదనే విమర్శలొస్తున్నాయి.

- ఫీజు బకాయిల గురించి విద్యార్థులను వేధించొద్దన్న ప్రభుత్వం

- జేఎన్‌టీయూకు పట్టని ముఖ్యమంత్రి ఆదేశాలు

- డబ్బు చెల్లించనిదే ధ్రువపత్రాల జారీకి ససేమిరా

- ప్రైవేటు కళాశాలలే బెటర్‌ అంటున్న విద్యార్థులు

హైదరాబాద్‌ సిటీ: ‘‘ఫీజు బకాయిల గురించి విద్యార్థుల సర్టిఫికెట్లు ఆపొద్దు’’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Chief Minister Revanth Reddy) ఇటీవల ఓ బహిరంగ సభలో ప్రైవేటు కళాశాలలను హెచ్చరించారు. ప్రైవేటు కళాశాలల సంగతి దేవుడెరుగు.. సీఎం హెచ్చరికలను ప్రభుత్వ కళాశాలైన జేఎన్‌టీయూ అధికారులే ఖాతరు చేయడం లేదు. ప్రభుత్వం చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను, పేద విద్యార్థుల నుంచి ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారు.

బకాయిల వసూళ్లకు క్యాంపస్‌ కళాశాల అధికారులు వ్యవహరిస్తున్న తీరును చూస్తే, ప్రైవేటు ఇంజనీరింగ్‌ కాలేజీలే చాలా బెటర్‌ అన్నట్లు ఉందనే చర్చ జరుగుతోంది. యూనివర్సిటీ కళాశాలల్లో గతేడాది బీటెక్‌, ఎంటెక్‌ కోర్సులు పూర్తి చేసిన వేలాది మంది విద్యార్థులు తమ, ధ్రువపత్రాల కోసం నిత్యం కళాశాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. డబ్బులు చెల్లించనిదే సర్టిఫికెట్లు ఇచ్చే ప్రసక్తే లేదని ప్రిన్సిపాల్‌, వైస్‌ ప్రిన్సిపాళ్లు హుకూం జారీ చేస్తున్నారు.

కన్నీరు మున్నీరవుతున్న విద్యార్థులు

ధ్రువపత్రాల కోసం వెళ్తున్న విద్యార్థులను కళాశాల అధికారులు కసురుకుంటుండడంతో బాధితులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ముఖ్యమంత్రి, ఇతర ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు చాలావరకు ప్రైవేటు ఇంజనీరింగ్‌ కళాశాలల యాజమాన్యాలు సైతం తమ విద్యార్థులకు ఒరిజినల్‌ ధ్రువపత్రాలను, లేదా వాటికి బదులు (సాఫ్ట్‌ కాపీలైనా) నకళ్లు ఇస్తుండగా, జేఎన్‌టీయూ అధికారులు డబ్బు చెల్లించనిదే ధ్రువపత్రాల ప్రింట్‌ కూడా ఇచ్చేది లేదని అంటున్నారు. వందలాది మంది బీటెక్‌, ఎంటెక్‌ విద్యార్థులు తమ డిగ్రీ సర్టిఫికెట్లు ఇవ్వాలని కళాశాల ప్రిన్సిపాల్‌ చాంబర్‌ వద్దకు వస్తుండగా, ఆయన అందుబాటులో లేరని సిబ్బంది చెబుతున్నారని పేర్కొంటున్నారు. వైస్‌ ప్రిన్సిపాల్‌ను సంప్రదిస్తే ప్రిన్సిపాల్‌ ఆనుమతిస్తేనే సర్టిఫికెట్ల ముద్రణ మొదలు పెడతామని స్పష్టం చేశారు.

దోచుకునేలా ఆదేశాలు!

ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను, గ్రాంటును తెచ్చుకోవడంలో విఫలమైన పాలనాధికారులు విద్యార్థులను నిలువునా దోచుకునేలా కిందిస్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీ చేస్తున్నారని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. పరీక్షల విభాగం ద్వారా గ్రేస్‌మార్కులకు డబ్బుల వసూళ్లు, ప్రాజెక్టు అనుమతులకు రూ.లక్షల్లో జరిమానాలు, రూ.వేలల్లో పరీక్షల ఫీజు పెంపు పేరుతో డబ్బులు గుంజుతుండడమే ఇందుకు నిదర్శనంగా చెబుతున్నారు. వర్సిటీలో ఫీజుల దోపిడి గురించి ప్రభుత్వ పెద్దలకు విద్యార్థి సంఘాల నుంచి ఫిర్యాదుల వెళ్ళడంతో, వివరణ కోరుతూ ఇటీవల వర్సిటీ ఉన్నతాధికారులకు తాకీదులు పంపినట్లు తెలిసింది. అయితే, ఇతర యూనివర్సిటీల కంటే తాము తక్కువ ఫీజులే వసూలు చేస్తున్నామని తప్పుడు సమాచారం పంపినట్లు తెలుస్తోంది.

ఈ వార్తలు కూడా చదవండి..

పసిడి, వెండి ధరలు మరింత పైకి!

కవితనే కాదు ఎవరైనా సీఎం కావొచ్చు

Read Latest Telangana News and National News

Updated Date - Dec 19 , 2025 | 08:35 AM