ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

High School Students: హైస్కూల్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రూ.కోటి నజరానా..

ABN, Publish Date - Oct 11 , 2025 | 04:26 PM

హైస్కూల్‌ విద్యార్థుల్లో దాగిన ప్రతిభను వెలికి తీసేందుకు విద్యా శాఖ నడుం బిగించింది. అందుకోసం నిత్యం వివిధ కార్యక్రమాలు రూపొందిస్తోంది. తాజాగా 6 నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థుల కోసం ప్రత్యేక కార్యక్రమం రూపొందించింది.

న్యూఢిల్లీ, అక్టోబర్ 11: హైస్కూల్ స్థాయి విద్యార్థుల్లో దాగిన ప్రతిభను వెలికి తీసేందుకు కేంద్ర విద్యా శాఖ నిత్యం వివిధ కార్యక్రమాలు రూపొందిస్తోంది. తాజాగా 6 నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. సమాజంలో వివిధ రకాల సమస్యలపై తమదైన శైలిలో పరిష్కారం సత్తా చూపగలిగితే.. అలాంటి వారికి ఖరీదైన బహుమతులు అందజేస్తామని ప్రకటించింది.

నీతి ఆయోగ్, అటల్ ఇన్నోవేషన్ మిషన్ సహకారంతో వికసిత్ భారత్ బిల్డ్‌థాన్ 2025 పేరుతో అతి పెద్ద కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. అందులో దేశంలోని అన్ని పాఠశాలలు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చింది. ‘స్వదేశీ, వోకల్ ఫర్ లోకల్, ఆత్మనిర్భర్ భారత్, సమృద్ధి భారత్’ థీమ్‌లతో ఆవిష్కరణలు, సమస్యలు పరిష్కారానికి ప్రయోగాలను రూపొందించించాలని సూచించింది.

ఒక స్కూల్ నుంచి ఎన్ని బృందాలైన పాల్గొనవచ్చు. ఒక్కో బృందంలో మూడు నుంచి 5 మంది విద్యార్థులు సభ్యులుగా ఉండొచ్చు. అయితే వీరి వివరాలను అధికారిక బిల్డ్‌థాన్ పోర్టల్ vbb.mic.gov.inలో నమోదు చేసుకోవాలి. దీంతో వారికి ప్రత్యేక ఐడీ జనరేట్ అవుతుంది. ప్రతి బృందం నాలుగు థీమ్‌లలో ఒకదాని ఎంచుకుని సమస్యకు రెండు నుంచి ఐదు నిమిషాల నిడివితో విభిన్న పరిష్కారం చూపుతూ వీడియో చేయాలి.

సదరు వీడియోను అక్టోబర్ 13 నుంచి 31వ తేదీలోపు అప్‌లోడ్ చేయాలి. ఈ వీడియోలను నవంబర్ 1 నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు నిపుణుల బృందం పరిశీలిస్తుంది. 2026 జనవరిలో విజేతల పేర్లను ప్రకటిస్తారు. అలా 10 జాతీయ, 100 రాష్ట్ర, 1000 జిల్లా స్థాయిలో బృందాలను ఎంపిక చేసి విజేతలకు రూ. కోటి విలువైన బహుమతులు అందజేస్తారు.

ఈ వార్తలు కూడా చదవండి..

రాహుల్‌కు నోబెల్ శాంతి బహుమతి..!:

కాంగ్రెస్ నేత బజారురౌడీలా పేర్నినాని తీరు.. మూల్యం చెల్లించుకోక తప్పదన్న మంత్రి

Read Latest National News and Telugu News

Updated Date - Oct 11 , 2025 | 05:31 PM