Nobel Peace Prize for Rahul Gandhi? Congress: రాహుల్‌కు నోబెల్ శాంతి బహుమతి..!: కాంగ్రెస్ నేత
ABN , Publish Date - Oct 11 , 2025 | 03:26 PM
వెనెజువెలా ప్రతిపక్ష నేత మరియా కొరినా మచాడోకు, భారతలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని రాజకీయంగా పోలికలు ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ నేత పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి నోబెల్ శాంతి బహుమతి అందుకునేందుకు అన్ని
న్యూఢిల్లీ, అక్టోబర్ 11: వెనిజులాలూ శాంతి ప్రక్రియ నెలకొల్పే క్రమంలో ప్రజాస్వామ్య హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేసిన ప్రతిపక్ష నేత, కార్యకర్త మరియా కొరినా మచాడో నోబెల్ బహుమతికి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఆమెపై ప్రశంసల వర్షం కురుస్తోంది. అయితే ఆమెకు లోక్‌సభలో ప్రతిపక్ష నేత, ఎంపీ రాహుల్ గాంధీకి సారూప్యత ఉందని కాంగ్రెస్ పార్టీ నేత సురేంద్ర సింగ్ రాజ్‌పుట్ అభిప్రాయ పడ్డారు.
వెనెజువెలాలో ఆమె ప్రజాస్వామ్య హక్కుల కోసం పారాటం చేస్తే.. భారత్‌లో రాజ్యాంగాన్ని రక్షించేందుకు రాహుల్ గాంధీ పోరాటం చేస్తున్నారని స్పష్టం చేశారు. ఆయన సైతం ఈ శాంతి బహుమతికి అర్హుడని తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలి లోక్ సభ స్థానం నుంచి ఆయన గెలుపొందారన్నారు. ఈ మేరకు శనివారం కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి సురేంద్ర సింగ్ రాజ్‌పుట్ తన ఎక్స్ ఖాతా వేదికగా వెల్లడించారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
రాజ్యాంగంపై దాడంటూ..
ప్రధాని నరేంద్ర మోదీతోపాటు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని అంతం చేసేందుకు కుట్రలు చేస్తోందని రాహుల్ గాంధీ విమర్శిస్తున్నారు. వివిధ సందర్భాల్లో పలు వేదికపై నుంచి ఆయన ఈ తరహా విమర్శలు సంధిస్తున్నారు. అలాగే ప్రజల ప్రజాస్వామ్య హక్కులతోపాటు భారత రాజ్యాంగాన్ని సైతం రక్షించేందుకు తాను యుద్ధం చేస్తున్నట్లు ఇప్పటికే పలుమార్లు రాహుల్ గాంధీ ప్రకటించిన విషయం విదితమే.
రాహుల్ వ్యాఖ్యలు.. తొసిపుచ్చిన బీజేపీ
అయితే రాహుల్ గాంధీ చేసిన ఈ ఆరోపణలను బీజేపీ ఇప్పటికే తోసిపుచ్చింది. కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడైన రాహుల్ గాంధీ భారత వ్యతిరేక శక్తుల జెండా మోసే వ్యక్తిగా అభివర్ణించింది. ఆయన స్వభావమే అంత అని బీజేపీ ఇప్పటికే వివరించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
రైతుల శ్రేయస్సు కోసం లెక్కలేనన్ని సంస్కరణలు తెచ్చాం.. ప్రధాని మోదీ
చినాబ్‌పై సావల్‌కోట్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్
Read Latest National News and Telugu News