Share News

Kollu Ravindra Warns Perni Nani: బజారు రౌడీలా పేర్నినాని తీరు.. మూల్యం చెల్లించుకోక తప్పదన్న మంత్రి

ABN , Publish Date - Oct 11 , 2025 | 03:56 PM

బందరులో తెలుగుదేశం నాయకుల్ని తాను కంట్రోల్ చేస్తున్నా కాబట్టి పేర్ని నాని ఇష్టారీతిన ప్రవర్తిస్తున్నారని కొల్లు రవీంద్ర అన్నారు. సీఎం చంద్రబాబు తమకు నేర్పిన క్రమశిక్షణ కారణంగానే తెలుగుదేశం శ్రేణులు సంయమనం పాటిస్తున్నారని వెల్లడించారు.

Kollu Ravindra Warns Perni Nani: బజారు రౌడీలా పేర్నినాని తీరు.. మూల్యం చెల్లించుకోక తప్పదన్న మంత్రి
Kollu Ravindra Warns Perni Nani

విజయవాడ, అక్టోబర్ 11: మాజీ మంత్రి పేర్నినాని(Former Minister Perni Nani)పై మంత్రి కొల్లు రవీంద్ర (Minister Kollu Ravindra) తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం నాడు మీడియాతో మాట్లాడుతూ.. బందరులో ఓటమి తట్టుకోలేక పేర్ని నాని మతిస్థిమితం కోల్పోయి బజారు రౌడీలా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. ఒకప్పుడు ప్రజా ప్రతినిధిని అనే విచక్షణ మరిచి పశువు కంటే హీనంగా వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు. బందరులో తెలుగుదేశం నాయకుల్ని తాను కంట్రోల్ చేస్తున్నా కాబట్టి పేర్ని నాని ఇష్టారీతిన ప్రవర్తిస్తున్నారని ఆగ్రహించారు. సీఎం చంద్రబాబు తమకు నేర్పిన క్రమశిక్షణ కారణంగానే తెలుగుదేశం శ్రేణులు సంయమనం పాటిస్తున్నారని వెల్లడించారు.


టీడీపీ నాయకులు ఎక్కడ కంట్రోల్ తప్పుతారో అనే భయంతో వారిని రోజూ సముదాయించాల్సి వస్తోందన్నారు. ఇదే తీరు కొనసాగితే పేర్ని నాని తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. టీడీపీ శ్రేణులతో తన్నులు తిని సానుభూతి పొందాలని పేర్ని నాని భావిస్తున్నాడేమో అంటూ ఎద్దేవా చేశారు. పేర్ని నాని ఆగడలపై న్యాయ సలహా తీసుకుని చట్టపరంగా ముందుకెళ్తున్నామన్నారు. అతని అసత్య ప్రచారాలపై పరువు నష్టం దావా వేస్తున్నామని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.


కల్తీ మద్యంపై...

మొలకలచెరువు కల్తీ మద్యంపై పూర్తి విచారణ జరుగుతోందని తెలిపారు. 20 మందిలో 14 మందిని అరెస్టు చేశామని.. జనార్ధన్‌ను కూడా కస్టడీలోకి తీసుకున్నామన్నారు. కల్తీ‌ మద్యానికి లింక్‌లో ఉన్న వైన్ షాపును సీజ్ చేశామని తెలిపారు. బెంగళూరు, ఏపీ రాష్ట్రాలలో నాలుగు టీమ్ లు పెట్టామని.. ప్రతీ షాపునకు క్లియర్ ఇన్‌స్ట్రక్షన్లు ఇచ్చామని మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు.


ఇవి కూడా చదవండి...

కల్తీ మద్యం.. జగన్‌‌పై వర్ల రామయ్య ప్రశ్నల వర్షం

దుర్గగుడి అభివృద్ధికి కట్టుబడి ఉంటా..

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 11 , 2025 | 06:06 PM