Varla Ramaiah On Jagan Liquor Scam: కల్తీ మద్యం.. జగన్‌పై వర్ల రామయ్య ప్రశ్నల వర్షం
ABN , Publish Date - Oct 11 , 2025 | 03:39 PM
దాయాదుల మద్యం వ్యాపారంలో కల్తీ జరుగుతోందని సౌత్ ఆఫ్రికా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారనేది నిజం కాదా అని వర్ల రామయ్య అన్నారు. వైసీపీ కోవర్ట్ జయచంద్రా రెడ్డి.. వైఎస్ సునీల్ రెడ్డి, వైఎస్ అనిల్ రెడ్డి క్యాంప్‌లో తలదాచుకున్నారనేది నిజం కాదా అని మరో ప్రశ్న సంధించారు.
అమరావతి, అక్టోబర్ 11: గత 6 సంవత్సరాలుగా రాష్ట్రంలో కల్తీ మద్యం ఏరులై పారటానికి కర్త, కర్మ, క్రియ జగనే అని పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య (TDP Leader Varla Ramaiah) వ్యాఖ్యలు చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. కల్తీ మద్యం కుట్రదారులను ప్రోత్సహిస్తూ, కల్తీ మద్యానికి మూల విరాట్ కూడా జగనే అని అన్నారు. జగన్ దాయాదులైన వైఎస్ సునీల్ రెడ్డి, వైఎస్ అనిల్ రెడ్డి సౌత్ ఆఫ్రికాలో మద్యం వ్యాపారం చేస్తున్నారనేది నిజం కాదా అని ప్రశ్నించారు. వైఎస్ సునీల్ రెడ్డి, వైఎస్ అనిల్ రెడ్డి.. జగన్ వ్యాపార బినామీలు అవునా, కాదా? అని నిలదీశారు. దాయాదుల మద్యం వ్యాపారంలో కల్తీ జరుగుతోందని సౌత్ ఆఫ్రికా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారనేది నిజం కాదా అని అన్నారు. వైసీపీ కోవర్ట్ జయచంద్రా రెడ్డి.. వైఎస్ సునీల్ రెడ్డి, వైఎస్ అనిల్ రెడ్డి క్యాంప్‌లో తలదాచుకున్నారనేది నిజం కాదా అని మరో ప్రశ్న సంధించారు.
‘మీరు ముఖ్యమంత్రిగా ఉండగా జంగారెడ్డిగూడెంలో కల్తీ మద్యం తాగి 27 మంది చనిపోతే, ఆ కేసును తప్పుదారి పట్టించింది మీరు కాదా? మీ పార్టీ నాయకుడు మల్లాది విష్ణు బార్‌లో కల్తీ మద్యం తాగి 6 గురు చనిపోతే, అతన్ని ఎందుకు సస్పెండ్ చేయలేదు? గతంలో సర్వేపల్లి, కావలి నియోజకవర్గాల్లో మీ నాయకులు కాకాణి గోవర్ధన్, రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కల్తీ మద్యంలో భాగస్వాములైనది నిజం కాదా? వారిపై కేసులు ఉన్నది నిజం కాదా? వారిపై మీ పార్టీ తరఫున క్రమశిక్షణ చర్యలు ఎందుకు తీసుకోలేదు? మీ పార్టీ కోవర్ట్ అయిన జయచంద్రా రెడ్డిపై ప్రభుత్వం లుక్ అవుట్ నోటీసులు జారీ చేసి, పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. జయచంద్రా రెడ్డి ఇప్పుడు ఎక్కడ తలదాచుకున్నాడో మీకు తెలియదా, జగన్ గారు? మీరు ముఖ్యమంత్రిగా ఉండగా మీరు సరఫరా చేసిన మద్యంలో విషపూరిత పదార్థాలు ఉన్నట్లు చెన్నై, బెంగళూరు ల్యాబ్‌లు నిర్ధారించింది నిజం కాదా? బాధ్యులపై వెంటనే చర్యలు ఎందుకు తీసుకోలేదు? నిన్న ఏలూరులో మద్యం తాగి ఒక వ్యక్తి చనిపోతే, అది కల్తీ మద్యంగా ప్రచారం చేశారు. అది కల్తీ మద్యం కాదని ఆర్ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్ నిర్ధారించింది. దీనిపై మీ సమాధానం ఏమిటి జగన్? కల్తీ మద్యం సరఫరాకు మూలవిరాట్ మీరే అని మేము చెబుతున్నాం. దీనిపై బహిరంగ చర్చకు మీరు సిద్ధమా?’ అంటూ జగన్‌పై వర్ల రామయ్య ప్రశ్నల వర్షం కురిపించారు.
ఇవి కూడా చదవండి...
దుర్గగుడి అభివృద్ధికి కట్టుబడి ఉంటా..
కల్తీ మద్యానికి మూల విరాట్ జగన్..
Read Latest AP News And Telugu News