Pawan Kalyan Meeting On Officials: కాలుష్య నియంత్రణ చర్యలు వేగవంతం చేయాలి.. పవన్ కల్యాణ్ ఆదేశాలు
ABN , Publish Date - Oct 11 , 2025 | 01:57 PM
కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) సమీక్ష సమావేశం నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమీక్షలో కాకినాడ జిల్లా యంత్రాంగం పాల్గొంది.
అమరావతి,అక్టోబరు11(ఆంధ్రజ్యోతి): కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఇవాళ (శనివారం) సమీక్ష సమావేశం నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమీక్షలో కాకినాడ జిల్లా యంత్రాంగం పాల్గొంది. ఉప్పాడ తీర ప్రాంతంలో కాలుష్య నియంత్రణ అంశాలపై దిశానిర్దేశం చేశారు పవన్ కల్యాణ్.
కాకినాడ జిల్లాలో ఉన్న పారిశ్రామిక కాలుష్యం, మైనింగ్ మూలంగా తలెత్తుతున్న కాలుష్య ఇబ్బందులపై చర్చించారు. కాకినాడలో చేపట్టిన మత్స్యకారులతో మాట.. మంతిలో మత్స్యకారులు ప్రస్తావించిన అంశాలు, వారి సందేహాలపై పీసీబీ నుంచి వివరాలు తీసుకున్నారు పవన్ కల్యాణ్. పొల్యూషన్ ఆడిట్‌కి అనుసరించాల్సిన విధివిధానాలపై చర్చించారు. కాకినాడ జిల్లాతోపాటు గోదావరి జిల్లాల్లో ఉన్న కాలుష్య పరిస్థితులు, పర్యావరణ పరిరక్షణపై వివరాలు అడిగి పవన్ కల్యాణ్ తెలుసుకున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
దేవలంపేట అంబేద్కర్ ఘటన.. ఏపీ ప్రభుత్వం చర్యలు
జగన్ స్కాంలు ఏపీ నుంచి ఆఫ్రికా వరకు.. ఎమ్మెల్యే గోరంట్ల సెటైర్లు
Read Latest AP News And Telugu News