Share News

AP Government: దేవలంపేట అంబేద్కర్ ఘటన.. ఏపీ ప్రభుత్వం చర్యలు

ABN , Publish Date - Oct 11 , 2025 | 08:43 AM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత ఇవాళ(శనివారం) దేవలం పేటలో పర్యటించనున్నారు. అంబేద్కర్ విగ్రహానికి మంటలు అంటుకున్న ఘటనను పరిశీలించనున్నారు.

  AP Government: దేవలంపేట అంబేద్కర్ ఘటన.. ఏపీ ప్రభుత్వం చర్యలు
AP Government ON Devalampeta Ambedkar incident

చిత్తూరు, అక్టోబరు11 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత (Vangalapudi Anitha) ఇవాళ(శనివారం) దేవలంపేట (Devalampeta)లో పర్యటించనున్నారు. అంబేద్కర్ విగ్రహాని (Ambedkar Statue)కి మంటలు అంటుకున్న ఘటనను పరిశీలించనున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు దేవలంపేటలోని అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకోనున్నారు. అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొననున్నారు హోంమంత్రి అనిత. ఈనెల మూడో తేదీన దేవళంపేటలో అంబేద్కర్ విగ్రహానికి మంటలు అంటుకొని పాక్షికంగా కాలిపోయిన విషయం తెలిసిందే.


ఈ ఘటనలో వైసీపీ సర్పంచ్ గోవిందయ్యని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కి పంపించారు. గోవిందయ్యకి సహకరించిన మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామిపై కూడా కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని టీడీపీ నేతలు నిరసన చేశారు. ఈ క్రమంలో వైసీపీ రాజకీయ డ్రామాలపై నిరసన తెలుపుతూ టీడీపీ శ్రేణులు రాష్ట్రవ్యాప్త ఆందోళనకు దిగాయి. ఇలా దేవలంపేట అంబేద్కర్ విగ్రహ పరిణామం ఏపీ వ్యాప్తంగా సంచలనమైంది. దీంతో కూటమి ప్రభుత్వం ఈఘటనపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ క్రమంలో ఈ ఘటనకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని చిత్తూరు జిల్లా పోలీసులను ఏపీ ప్రభుత్వం ఆదేశించింది.


ఈ వార్తలు కూడా చదవండి...

పారిశ్రామికవేత్తలని జగన్ అండ్ కో బెదిరిస్తున్నారు.. ఎంపీ రమేశ్ ఫైర్

ఏపీ లిక్కర్ స్కాం కేసు.. చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సుప్రీంలో ఊరట

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 11 , 2025 | 08:48 AM