Share News

Gorantla Fires on Jagan: జగన్ స్కాంలు ఏపీ నుంచి ఆఫ్రికా వరకు.. ఎమ్మెల్యే గోరంట్ల సెటైర్లు

ABN , Publish Date - Oct 11 , 2025 | 11:58 AM

జగన్ ఏపీ అసెంబ్లీకి ఎందుకు రావట్లేదని తెలుగుదేశం రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీకి జగన్ వచ్చి మాట్లాడవచ్చు కదా అని హితవు పలికారు.

Gorantla Fires on Jagan: జగన్ స్కాంలు ఏపీ నుంచి ఆఫ్రికా వరకు.. ఎమ్మెల్యే గోరంట్ల సెటైర్లు
Gorantla Butchaiah Chowdary Fires on Jagan

రాజమండ్రి, అక్టోబరు11(ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) పై తెలుగుదేశం రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి (Gorantla Butchaiah Chowdary) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మెడికల్ కాలేజీల విషయంలో వైసీపీ ప్రభుత్వం కమీషన్లు తీసుకుందని ఆరోపించారు. పీపీపీ విధానంతో మెడికల్ సీట్లు అధికంగా వస్తాయని వివరించారు. జగన్ అనేక ప్రాజెక్టులకు పీపీపీ విధానం అమలు చేశారని గుర్తుచేశారు. ఇవాళ(శనివారం) రాజమండ్రిలో మీడియాతో ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడారు. భారతదేశంలో ఎక్కడ లేని విధంగా కూటమి ప్రభుత్వంలో పేదలకు రూ.25 లక్షలు ఇన్సూరెన్స్ ఇస్తున్నామని ప్రకటించారు. జగన్ అండ్ కో శాడిస్టు మనస్తత్వంతో వ్యవహారిస్తున్నారని ధ్వజమెత్తారు ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి.


ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్షం లేకపోయినా ప్రతిపక్ష బాధ్యతను తాము తీసుకుని ప్రజా సమస్యలపై మాట్లాడుతున్నామని చెప్పుకొచ్చారు. అవగాహన లేని వైసీపీ నేతలు వక్రభాష్యం చెబుతున్నారని విమర్శించారు. జగన్ పరిపాలన నిర్మాణాత్మకంగా జరుగలేదని ఎద్దేవా చేశారు. జగన్ ఎందుకు అసెంబ్లీకి రావట్లేదని ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీకి జగన్ వచ్చి మాట్లాడవచ్చు కదా అని హితవు పలికారు. చేతకాని దద్దమ్మలు రెండు పార్టీల మధ్య చిచ్చు పెడుతున్నారని ఫైర్ అయ్యారు. జర్నలిస్టు సమస్యల మీద అసెంబ్లీలో తాము మాట్లాడుతున్నామని.. మెడికల్ కాలేజీల కోసం మాట్లాడితే వైసీపీ నేతలు సోషల్ మీడియాలో అసభ్యంగా తిడుతున్నారని ధ్వజమెత్తారు. వైసీపీ కుంభకోణాలు ఆంధ్రప్రదేశ్ నుంచి ఆఫ్రికా వరకు చేరాయని ఎద్దేవా చేశారు ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి.


జగన్ అండ్ కో ఇతర దేశాల్లో కూడా ఏపీ పరువు తీశారని విమర్శించారు. జైలు నుంచి విడుదలైన వైసీపీ నేతలను హీరోలంటూ ఊరేగింపులు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. వైసీపీ లాగా తమ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేపట్టలేదని చెప్పుకొచ్చారు. జగన్ దోచుకున్న సొమ్ముతో కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని సెటైర్లు గుప్పించారు. జగన్ లాగా అబద్ధాలు చెప్పి తాము పబ్బం గడుపుకోవటం లేదని చెప్పుకొచ్చారు. చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కల్యాణ్‌లు పెద్ద నటులని.. వాళ్లందరూ మిత్రులని తెలిపారు. జగన్ పాలనలో సినిమా హీరోలను అవమానించారనే అంశంపైనే అసెంబ్లీలో చర్చ జరిగిందని గుర్తుచేశారు. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులకి జగన్ ఐదేళ్లపాటు బకాయిలు చెల్లించకపోతే.. అప్పుడు ఏం చేశారని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వంలో ఏపీ దివాలా తీసిందని విమర్శించారు ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి.


మెడికల్ కాలేజీల కోసం వైసీపీ నేతలు ఇప్పుడు మాట్లాడటం సిగ్గుచేటని ఆక్షేపించారు. మెడికల్ కాలేజీలకు రూ.7,500 కోట్లు అవసరమైతే.. వైసీపీ హయాంలో ఒక్క రూపాయి కూడా ఎందుకు విడుదల చేయలేదని ప్రశ్నల వర్షం కురిపించారు. మెడికల్ కాలేజీలను వైసీపీ పునాదుల్లోనే వదిలేసిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఏం చెప్పిందో అదే చేస్తోందని స్పష్టం చేశారు. తమ పాలనలో పలు అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసి చూపిస్తామని ఉద్ఘాటించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే మెడికల్ కాలేజీలకు తమ ప్రభుత్వం పీపీపీ విధానం అమలు చేస్తోందని స్పష్టం చేశారు. కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాలని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కోరారు.


ఈ వార్తలు కూడా చదవండి...

దేవలంపేట అంబేద్కర్ ఘటన.. ఏపీ ప్రభుత్వం చర్యలు

ఏపీ లిక్కర్ స్కాం కేసు.. చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సుప్రీంలో ఊరట

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 11 , 2025 | 12:13 PM